Advertisement

Advertisement


Home > Politics - Political News

కుమార సర్కారుకు మరో ఛాన్స్?!

కుమార సర్కారుకు మరో ఛాన్స్?!

రోజుల వారీగా అధికార కాలాన్ని పొడిగించుకునేందుకు కుమారస్వామి సర్కారుకు అవకాశాలు లభిస్తున్నట్టున్నాయి. బలనిరూపణకు గవర్నర్ ఆదేశించినా.. విశ్వాస తీర్మానంపై చర్చ సాగాలంటూ స్పీకర్ సభను కొనసాగిస్తూ ఉన్నారు. గురువారమే విశ్వాస పరీక్ష జరగాల్సి ఉండగా.. దాన్ని సోమవారానికి వాయిదా వేశారు.

అయితే సోమవారం అయినా బలపరీక్షపై చర్చ జరుగుతుందనే నమ్మకాలు కనిపించడం లేదు. ఆ రోజున ఇరవైమంది సభ్యులు మాట్లాడాల్సి ఉందట. ఇంతలోనే ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ మరణించారు. ఆమెకు సంతాపం ప్రకటించి, సోమవారం కర్ణాటక అసెంబ్లీ వాయిదా పడొచ్చు అనేమాట కూడా వినిపిస్తూ ఉంది.

ఈ అవకాశాన్ని సంకీర్ణ సర్కారు ఉపయోగించుకుంటుందని, సోమవారం సభ జరిగే అవకాశాలు లేవని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే కుమారస్వామి ప్రభుత్వానికి మరో రోజు అధికార కాలం లభించినట్టే. ఇంకోవైపు ఈ సమయాన్ని వినియోగించుకుని ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలను బుజ్జగిస్తూ ఉన్నారట కాంగ్రెస్, జేడీఎస్ నేతలు.

అలిగిన ఎమ్మెల్యేలకు సర్ధిచెప్పి ఏదోలా విశ్వాస పరీక్షను గట్టెక్కేందుకు ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయని తెలుస్తోంది. రోజుల వారీగా లభిస్తున్న అవకాశంతో కుమారస్వామి సర్కారు గట్టెక్కగలిగితే అది గొప్ప సంగతే అవుతుంది!

జగన్‌ మొహంలో చిరునవ్వు మార్పు కనబడుతోంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?