Advertisement

Advertisement


Home > Politics - Political News

అతి ప్రచారం.. కొండెక్కిన కోడుగుడ్డు

అతి ప్రచారం.. కొండెక్కిన కోడుగుడ్డు

"రోజూ కోడి గుడ్డు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రెండు గుడ్లు తింటే ఇంకా మంచిది. కరోనా వైరస్ దరిచేరదు. ఫిట్ గా ఉంటాం." కొన్ని నెలలుగా ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారం ఇది. ఈ ప్రచారం కాస్తా ఇప్పుడు కోడిగుడ్డు కొండెక్కేలా చేసింది. ప్రస్తుతం ఏపీ రిటైల్ మార్కెట్ లో కోడి గుడ్డు ధర అమాంతం 6 రూపాయలకు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో 7 రూపాయలకు కూడా కోడి గుడ్డు అమ్మే పరిస్థితికి వచ్చింది.

అతి ప్రచారంతో పాటు గుడ్ల ఉత్పత్తి సగానికి సగం పడిపోవడం కూడా ధర పెరగడానికి కారణం. ఆంధ్రప్రదేశ్ లో రోజుకు సగటున 3 కోట్ల 65 లక్షల కోడిగుడ్లు ఉత్పత్పి అవుతాయి. అవి కాస్తా ఇప్పుడు 2 కోట్ల 80 లక్షలకు పడిపోయాయి. వీటిలో కోటికి పైగా గుడ్లు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి అయిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో గుడ్ల లభ్యత సగానికి పైగా పడిపోయింది.

లాక్ డౌన్ ప్రభావంతోనే కోడి గుడ్డు ధర పెరిగిందంటున్నారు వ్యాపారాలు. ఏప్రిల్-మే-జూన్ నెలల్లో విధించిన లాక్ డౌన్ ప్రభావం ఇప్పుడు పడిందని చెబుతున్నారు. ఆ 3 నెలల్లో రవాణా సౌకర్యం పెద్దగా లేకపోవడంతో కోళ్లకు దానా అందుబాటులోకి రాలేదు. దీంతో కోట్ల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఆ ప్రభావం సెప్టెంబర్ నెలపై పడింది.  

మరోవైపు దాణా రేట్లు, రవాణా ఛార్జీలు పెరగడంతో చాలామంది మధ్యతరహా వ్యాపారులు కోళ్ల పెంపకాన్ని తాత్కాలికంగా ఆపేశారు. చనిపోగా మిగిలిన కోళ్లను కూడా అమ్మేశారు. దీని వల్ల రోజుకు సగటున 50 నుంచి 60 లక్షల వరకు గుడ్ల ఉత్పత్తి నిలిచిపోయిందనేది ఓ అంచనా.

పౌల్ట్రీ నిపుణులు చెబుతున్న ప్రకారం.. అక్టోబర్ నెలాఖరు వరకు పరిస్థితి ఇలానే ఉంటుంది. ఈలోగా దాణా అందుబాటులోకి వచ్చి, కోళ్ల సంఖ్య పెరిగితే గుడ్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. లాక్ డౌన్ మొదలైన కొత్తలో అపోహలకు పోయి ప్రజలెవ్వరూ కోడి గుడ్డు తినలేదు. అలా అప్పట్లో 4 రూపాయలకే దొరికిన గుడ్డు, 4-5 నెలలకే 7 రూపాయలకు చేరుకుంది.

చీఫ్ జస్టిస్ అయితే కొత్త న్యాయం ఉందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?