Advertisement

Advertisement


Home > Politics - Political News

దీక్షలో ఉన్నప్పుడు డొంక తిరుగుడు ఎందుకు పవన్?

దీక్షలో ఉన్నప్పుడు డొంక తిరుగుడు ఎందుకు పవన్?

చాతుర్మాస దీక్షలో ఒంటిపూట ఆహారం, నేలమీద పడక, బ్రహ్మచర్యం.. ఇలా రకరకాల నియమాలుంటాయని గతంలో సెలవిచ్చారు పవన్ కల్యాణ్. అంటే రెండు పూటలు అన్నం తినడం మానేస్తారన్నమాట. కేవలం అన్నం మాత్రమే మానేస్తే చాలా, అబద్ధాలు ఆడటం కూడా మానేయాలేమో కదా. దీక్షలో ఉన్నప్పుడు అసత్యాలు పలకడం, అన్యాయాలకు అండగా నిలబడటం.. ఇవన్నీ కూడా తప్పే కదా. మరి పవన్ కల్యాణ్ చేస్తున్నదేంటి.

మూడు రాజధానుల బిల్లుకి అసెంబ్లీ ఆమోదం అయిపోయి, గవర్నర్ రాజముద్ర కూడా పడిన తర్వాత ఇంకా రాజధాని రైతులని రెచ్చగొట్టడం ఎందుకు? మూడు రాజధానులపై డొంకతిరుగుడుగా మాట్లాడ్డంలోనే పవన్ నిజాయితీ ఎంతో తేలిపోయింది. మూడు రాజధానులతో జరిగే సమగ్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న పవన్, చాతుర్మాస దీక్ష చేసి ఉపయోగం ఏంటి?

నిజంగా పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్ష నిష్టగా చేస్తున్నట్టయితే రాష్ట్ర ప్రజల ముందుకొచ్చి ఆయన నిజం చెప్పాలి. అమరావతి ముగిసిన కథ, ఇక ఆ సబ్జెక్ట్ వదిలేయండి, మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం అనే క్లారిటీ ఇవ్వాలి. అలాంటిదేం లేకుండా ఇంకా అమరావతి చుట్టూనే రాజకీయాలు నడపాలనుకోవడం, ఒకే ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందాలనే సంకుచిత స్వభావంతో ఉండటం, మూడు రాజధానులను అడ్డుకుని, ఉత్తరాంధ్ర-రాయలసీమ అభివృద్ధి నిరోధకుడిగా మారడం పవన్ కల్యాణ్ కి తగునా.

ప్రత్యేక హోదా విషయంలో పవన్ కల్యాణ్ తన స్టాండ్ ఎంత ఈజీగా మార్చుకున్నారో ఏపీ ప్రజలందరికీ తెలుసు. పాచిపోయిన లడ్డూలంటూ నాడు శివాలెత్తిన పవన్ కల్యాణే నేడు బీజేపీతో పొత్తుపొడిచాక.. అసలు హోదా ఎవరడిగారు, జనాలకు లేని బాధ నాకెందుకంటూ మాటమార్చారు.

మరి అమరావతి విషయంలో కూడా అంతే కదా. రాజధాని ప్రాంత వాసులు అవగాహన లేక ఆగ్రహంతో ఊగిపోవచ్చు, మిగతా 11 జిల్లాలవారికి అభివృద్ధి వికేంద్రీకరణ ఇష్టమే కదా? అలాంటప్పుడు పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజల సమగ్ర శ్రేయస్సు దృష్ట్యా మూడు రాజధానులకు మద్దతు పలకలేరా?

కనీసం చాతుర్మాస దీక్షలో ఉన్నన్ని రోజులైనా చంద్రబాబు హిడెన్ అజెండాని పవన్ తన భుజాన వేసుకోవడం మానుకోవాలి. అభివృద్ధి వికేంద్రీకరణకు సహకరించి అందరివాడు అనిపించుకోవాలి. 

హాస్పిటల్ లో చేరిన నటుడు పృధ్వీరాజ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?