cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

వీళ్ల‌కు ఎక్క‌డైనా చూపించాలి గురూ...

వీళ్ల‌కు ఎక్క‌డైనా చూపించాలి గురూ...

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడికి మొద‌లుకుని ఆ పార్టీకి చెందిన చాలా మంది నాయ‌కుల‌కు మ‌తం బాగా త‌ల‌కెక్కించు కున్నారు. అది కాస్తా ముదిరి విప‌రీత పోక‌డ‌ల‌కు దారి తీస్తోంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

చంద్ర‌బాబు, లోకేశ్‌ల విష‌యానికి వ‌స్తే ...వాళ్ల మాన‌సిక స్థితిపై ప్ర‌త్య‌ర్థులు అనుమానాలు వ్య‌క్తం చేసేస్థాయిలో వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. బీజేపీని చూసి వాత‌లు పెట్టుకుంటున్న టీడీపీ, రోజురోజుకూ మ‌త ప‌ర‌మైన విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెడుతుండ‌డాన్ని గ‌మ‌నించొచ్చు.

టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్‌కు ధైర్యం ఉంటే త‌న మ‌త‌మేదో, దేవుడెవ‌రో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని స‌వాల్ విసిరారు. 

అంటే జ‌గ‌న్ మ‌త‌మేదో, దేవుడెవ‌రో తెలియ‌కుండానే ఆయ‌న్ను ముఖ్య‌మంత్రిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఎన్నుకున్నార‌ని అచ్చెన్నాయుడు భావిస్తున్నారా?  మాన‌సిక స్థితి బాగున్న వాళ్లెవ‌రైనా ఇలాంటి స‌వాళ్లు, మ‌త‌ప‌ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తారా? అని ప్ర‌త్య‌ర్థుల ప్ర‌శ్న‌ల‌కు అచ్చెన్న ఏం స‌మాధానం చెబుతారు?

మ‌రోవైపు  రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఇదే అచ్చెన్న ఆరోపిస్తున్నారు.  ప్ర‌జ‌ల రాజ‌కీయ చైత‌న్యంపై అచ్చెన్న‌కు ఎందుకంత చిన్న‌చూపో అర్థం కావ‌డం లేదు. 

జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌, కేవ‌లం మ‌తం ఒక్క‌టే బ‌య‌ట ప‌డేస్తుంద‌నే అత్యాశ‌తో జిమ్మిక్కులు చేయ‌డం ప్ర‌జ‌లు ప‌సిగ‌ట్ట‌లేర‌ని అచ్చెన్నాయుడు భ్ర‌మ‌ల్లో బ‌తుకుతున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి.

ఇక చంద్ర‌బాబు సుపుత్రుడి బాధ అంతాఇంతా కాదు. ఈయ‌న సోష‌ల్ మీడియాలో త‌ప్ప‌, మ‌రెక్క‌డా క‌నిపించ‌కుండా సీరియ‌స్ రాజ‌కీయాలు చేస్తున్నట్టు ఊహాలోకంలో విహ‌రిస్తుంటారు.  

వైఎస్ జ‌గ‌న్‌ను క్రిస్టియ‌న్ ముఖ్య‌మంత్రిగా అభివ‌ర్ణించ‌డం లోకేశ్‌కు, ఆయ‌న తండ్రి చంద్ర‌బాబుకే చెల్లింది. ధ‌ర్మాన్ని కాపాడమంటే క్రిస్టియన్‌ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఎందుకంత కోపమని లోకేశ్ ట్విట‌ర్ వేదిక‌గా ప్రశ్నించడం గ‌మ‌నార్హం. అన్ని మతాలనూ సమానంగా చూడాలని అంటే ఎందుకంత అసహనం? అని లోకేశ్ ప్ర‌శ్నించ‌డంలోని హాస్యాన్ని గుర్తించొచ్చు. 

ఏనాడూ ప్ర‌జ‌ల్లో లేని , ప్ర‌జ‌ల‌తో సంబంధం లేని వారు కూడా సోష‌ల్ మీడియాలో ట్వీట్లు, కామెంట్స్ చేస్తూ , పే...ద్ద రాజ‌కీయ నేత‌ల మాదిరిగా ఫోజు కొట్ట‌డం వీళ్ల‌కే చెల్లింద‌బ్బా. ప్ర‌త్య‌ర్థులంటున్న‌ట్టు వీళ్ల‌కు ఎక్క‌డైనా చూపించ‌డం రాష్ట్ర శ్రేయ‌స్సు దృష్ట్యా అవ‌స‌రం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

క‌థ మొత్తం బంగారం చూట్టే

క్రాక్ సినిమా బాలీవుడ్ లో ఆ హీరోతో తీస్తా

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×