Advertisement

Advertisement


Home > Politics - Political News

తమ్ముళ్ళ భోగీ మంట అదిరింది..?

తమ్ముళ్ళ భోగీ మంట అదిరింది..?

అవును ఇది నిజమే. భోగీ మంట అంటే సాధారణంగా ఇంట్లో పాత వస్తువులు. ఇతర సామగ్రి ఏదైనా ఉంటే దాన్ని అందులో వేసి మంట పెడతారు. అయితే ఏపీలో విపక్షంలోకి వచ్చిన తరువాత ప్రతీ భోగీకి తెలుగుదేశం ఏదో ఒక నిరసన చేస్తోంది.

అందులో వైసీపీ సర్కార్ జారీ చేసిన జీవోలను తెచ్చి పడేస్తోంది. ఇప్పటికి మూడేళ్ళుగా వైసీపీ అధికారంలో ఉంది. సహజంగా ప్రభుత్వం ఏం చేసినా విపక్షానికి గిట్టదు, ఇక వైసీపీ ఊ అంటే టీడీపీ ఎపుడూ ఉహూనే అంటుంది. అది అందరికీ తెలిసిన నిజమే.

దాంతో ప్రతీ ఏటా సర్కార్ జారీ చేసినా జీవోలన్నీ కూడా టీడీపీకి గిట్టనివే అవుతున్నాయి. దీంతో ఏ ఏటి కా ఏడు ఈ జీవోల సంఖ్య బాగా పెరిగిపోతోంది. మొత్తానికి భోగీ మంట పేరిట ప్రభుత్వ జీవోలను అందులో పడేసే ప్రొగ్రాం మాత్రం తమ్ముళ్లు పెర్ఫెక్ట్ గా చేస్తున్నారు.

జీవోలు అన్నీ తెచ్చి మరీ మంటలో పడవేస్తూ అవన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలే అని చెప్పాలని చూస్తున్నారు. మిగిలిన వారికి భోగీ మంటలు పండుగ అయితే తమ్ముళ్ళకు మాత్రం భోగీ మంటలు రాజకీయ కడుపు మంటగా మారుతోందని వైసీపీ నేతలు అందుకే ఘాటు విమర్శలు చేస్తున్నారు.

ఇక అన్నీ చెత్త జీవోలే, అన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలే అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు లాంటి వారు చేస్తున్న కామెంట్స్ కి కూడా వైసీపీ నేతలు హాట్ రిప్లై ఇస్తున్నారు. మీకు అంతా అలాగే కనిపిస్తుందని, ప్రజా కోణంలో ఎపుడైనా ఆలోచిస్తే కదా అంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇదంతా చూస్తూంటే భోగీ మంటలకు ప్రత్యేకంగా తమ్ముళ్లు కలప ఇతర సామగ్రి తెచ్చుకోనవసరం లేదేమో అని సెటైర్లు పడుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?