Advertisement

Advertisement


Home > Politics - Political News

విశాఖ, విజయనగరం...జంట నగరాలు !

విశాఖ, విజయనగరం...జంట నగరాలు !

జంట నగరాలు అంటే మనకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలిసిన పేర్లు హైదరాబాద్, సికింద్రాబాద్. రెండూ ఒకదానితో మరొకటి పెనవేసుకుని పోయాయి. ప్రగతి పరుగులు తీసింది. ఇపుడు ఏపీలో  కూడా అలాంటి జంటనగరాలు రాబోతున్నాయి. అవి కూడా అత్యంత వెనకబడిన ఉత్తరాంధ్రా జిల్లాల్లోనే జరగడం అంటే అద్భుతమే.

విశాఖకు పరిపాలన రాజధాని రావడం అంటే విజయనగరం జిల్లా దశ కూడా మారిపోయిందని చెప్పాలి. విశాఖకు విజయనగరానికి కేవలం యాభై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఇక విశాఖ కాపిటల్ సిటీ అనుకోవడమే కాదు, మొత్తం రెండు జిల్లాల అభివ్రుధ్ధికి బ్లూ ప్రింట్ కూడా రెడీ అయింది.

భోగాపురం ఎయిర్ పోర్ట్ విజయనగరంలో ఉంది. ఇక్కడ నుంచే మెట్రో రైల్ కూత పెడుతుంది. భోగాపురం నుంచి అచ్యుతాపురం వరకూ డెవలప్మెంట్ కారిడార్ ని ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది.

అదే విధంగా విశాఖ బీచ్ నుంచి భోగాపురం వరకూ కలుపుతూ బీచ్ సర్క్యూట్ ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మధ్యలో స్టార్ హొటల్స్, టూరిజం స్పాట్స్ వస్తాయి. ఇక విశాఖ విజయనగరం సరిహద్దుల్లోనే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్, సచివాలయం, ఇతర ప్రభుత్వ సంస్థలు ఉంటాయి.

దాంతో పారిశ్రామికంగా విశాఖతో పాటు విజయనగరాన్ని కూడా కలుపుకుని ముందుకుతీసుకుపోతారు. ఇక టూరిజం తో పాటు, ఇతర రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టెర్స్ రెడీగా ఉండడం శుభప.ణామమని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే రానున్న నాలుగేళ్ళలో జంట నగరాలుగా విశాఖ విజయాంగరం నిలిచి ఏపీకే కొత్త దశ, దిశ చూపిస్తాయనడంతో సందేహం లేదు.

ఒకసారి మోసపోయాను ఈ సారి వదలను

ఈ గడ్డంతో నిద్ర పట్టట్లేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?