Advertisement

Advertisement


Home > Politics - Political News

లక్షన్నర కోట్లతో విశాఖ మాస్టర్ ప్లాన్...

లక్షన్నర కోట్లతో విశాఖ మాస్టర్ ప్లాన్...

విశాఖ అంటే మెగా సిటీగానే చూడాలి. ఏపీకి రానున్న రోజులలో అన్ని రకాలుగా ఆర్ధిక వనరుగా విశాఖ ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇక విశాఖ పాలనారాజధాని అని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మరో వైపు చూస్తే అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ద్వారా ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాలు అభివృద్ధిలో ఒక్కటి కాబోతున్నాయి.

ఈ నేపధ్యంలో విశాక మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అధారిటీ (వీఎమ్మార్డీయే) విశాఖ సమగ్రాభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ ని రూపొందించింది. ఏకంగా లక్షన్నర కోట్లతో ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించడం విశేషం.

రానున్న రెండు దశాబ్దాల కాలంలో విశాఖ రూపురేఖలను సంపూర్ణంగా మార్చేసే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ ని డిజైన్ చేశారు. వీఎమ్మార్డీయే మొత్తం అయిదు జిల్లాలకు విస్తరించి ఉంది. దాంతో భవిషత్తులో ఈ ప్రాంతాలన్నీ పూర్తిగా ప్రగతిమార్గాన నడచే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. 

ఈ మాస్టర్ ప్లాన్ లో టూరిజం తో పాటు మెట్రో రైళ్ళ కోసం ప్రతిపాదనలు ఉన్నాయి. మొత్తానికి చూస్తే భారీ కసరత్తుతో తయారు చేసిన ఈ మాస్టర్ ప్లాన్ కచ్చితంగా అమలు చేస్తే విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల దశ, దిశ మారిపోతాయనడంలో సందేహం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?