పదవులు అంటే అధికారం చలాయించేవి. అందలాలు ఎక్కించేవి. బుగ్గ కార్లలో తిప్పేవి. ఆ పదవులు మాత్రం అసలైన తమ్ముళ్లకు ఎపుడూ ఆమడదూరమే.
కానీ పార్టీ పదవులు మాత్రం భారీగానే పంచేశారు చంద్రబాబు. ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీలో ఇన్నేసి పదవులు సృష్టించడం అంటే అది చంద్రబాబుకే చెల్లు అంటున్నారు.
ఇంతకీ టీడీపీ జాతీయ పార్టీయా, ప్రాంతీయ పార్టీయా అన్న డౌట్లు పక్కన పెడితే జాతీయ కార్యవర్గం అన్నది లేనపుడు రాష్ట్ర కమిటీలే గొప్ప. ఇపుడు జాతీయ కమిటీలు వేశారు. పోనీ అవే గ్రేట్ అనుకుంటే టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికీ ప్రాంతీయ పార్టీయే.
దాంతో ఆ పదవులు అందుకున్న వారు కానీ ఇపుడు జంబో కార్యవర్గంలో రాష్ట్ర కమిటీ పదవులు దక్కిన వారు కానీ తమ హోదాలు చూసుకుని ఎవరూ పొంగిపోయే స్థితిలో లేరని అంటున్నారు. అందరూ అందరే అన్నట్లుగా పదవులు పంచేశాక తమ్ముళ్ళంతా నాయకులయ్యారు.
కానీ పెత్తనం ఎవరి మీద చేయాలి. ఎవరు ఎవరి మాట వినాలి. మొత్తానికి అందరూ నాయకులే అన్నట్లుగా టీడీపీలో సీన్ ఉందిట. దాంతో తమ్ముళ్ళకు హుషార్ ఎక్కడ నుంచి వస్తుంది. మొత్తానికి మా చెడ్డ చిక్కొచ్చిపడిందిగా..