వ్యభిచారానికి మించిన సంపాదన మార్గం లేదని ఆ జూనియర్ ఆర్టిస్టులు అనుకున్నారు. ఒకవైపు సినిమా పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్‌లుగా పనిచేస్తున్నప్పటికీ….ఆ సంపదతో తృప్తి చెందలేదు. ఇంకా…ఇంకా సంపాదించాలని పట్టు పట్టారు. సినీ పరిశ్రమల్లో పరిచయాలను శరీరాలతో వ్యాపారం చేసేందుకు వాడుకున్నారు.
కొత్తగూడెం జిల్లా భద్రాద్రికి చెందిన కిరణ్, అశ్వారావుపేట నివాసి ఇంటి పవన్ సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్‌లు. సంపాదనకు చెడు మార్గం పట్టారు. హైదరాబాద్‌లో ఖైరతాబాద్ రాజ్‌నగర్‌లో గత ఏడాది డిసెంబర్‌లో ఓ ప్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్‌లైన వాళ్లిద్దరికీ అందమైన అమ్మాయిలతో పరిచయాలకు తక్కువ లేదు. ఈ పరిచయాలను సొమ్ము చేసుకోవడం మొదలు పెట్టారు.
పలు ప్రాంతాల నుంచి అందమైన యువతులను తీసుకొచ్చి వ్యభిచారం స్టార్ట్ చేశారు. కొంత కాలం ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం సాగింది. అయితే పోలీసులకు స్థానికుల నుంచి వ్యభిచారం నిర్వహణపై పంజాగుట్ట పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. పంజాగుట్ట పోలీసులు సదరు ప్లాట్‌పై దాడి చేశారు. నిర్వాహకుల్లో ఒకడు పారిపోగా, మరొకడు దొరికాడు.
పోలీసులకు పట్టుబడిన వారిలో జూనియర్ ఆర్టిస్ట్ పవన్(24) ఉన్నాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి, అతడి నుంచి సెల్‌ఫోన్, రూ. 2 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి తెలిపాడు. మరొకడి కోసం గాలిస్తున్నట్టు ఆయన చెప్పాడు.