వైఎస్సార్ కి దండం….మరి జగన్ కి… ?

ఏపీని తండ్రీ కొడుకులు పాలించడం ఇప్పటిదాకా జరగలేదు. ఆ రికార్డుని బ్రేక్ చేసిన వారు వైఎస్ జగన్. తండ్రి కూర్చున్న సీఎం సీట్లోకి జగన్ రావడానికి పదేళ్ల పాటు అతి పెద్ద ప్రజా పోరాటమే…

ఏపీని తండ్రీ కొడుకులు పాలించడం ఇప్పటిదాకా జరగలేదు. ఆ రికార్డుని బ్రేక్ చేసిన వారు వైఎస్ జగన్. తండ్రి కూర్చున్న సీఎం సీట్లోకి జగన్ రావడానికి పదేళ్ల పాటు అతి పెద్ద ప్రజా పోరాటమే చేశారు. ప్రజలనే నమ్ముకుని వారి అండతోనే దర్జాగా ఆ సింహాసనం ఎక్కారు.

అందువల్ల జగన్ కి ఆ పదవి వారసత్వంగా రాలేదు. తన జవసత్వాలతోనే ఆ  పదవి దక్కించుకున్నారు అన్నదే నిజం. అయితే ఏపీలో వైఎస్సార్ పాలనను గుర్తు తెచ్చేలా జగన్ కూడా ఏలుతున్నారు. విభజన ఏపీకి ఎన్ని కష్టాలు ఉన్నా తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు.

ఇక వైఎస్సార్ ఏలుబడిలో విపక్షంగా టీడీపీ ఎలాంటి ఘాటు విమర్శలు చేసిందో అందరికీ తెలుసు. ఆ వివరాలు ఈ రోజుకీ భద్రంగా చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయి. ఇపుడు జగన్ సీఎం. ఆయన యువ ముఖ్యమంత్రి. జగన్ పాలనలో సగం కాలం గడచించి. విపక్షానికి ఎక్కడా ఎలాంటి చాన్స్ ఇవ్వకుండా జగన్ జోరు చేస్తున్నారు.

మరి జగన్ మార్క్ పాలిటిక్స్ ని తట్టుకోలేకపోతోంది టీడీపీ. దీంతో జగన్ మీద అనేక రకాలుగా విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో జగన్ కి వైఎస్సార్ కి పోలిక పెట్టి ఆయనే నయం, ఆయన గొప్పవాడు అంటూ కూడా చెబుతూ వస్తోంది. నిజంగా వైఎస్సార్ సీఎం గా ఉండగా ఆయన్ని ఘాటుగా విమర్శించిన నోళ్లే ఇపుడు జగన్ని తక్కువ చేసేందుకు ఆయన్ని చెడ్డ చేసేందుకు వ్యూహాత్మకంగానే ఈ పోలికను తెస్తున్నారు అన్న విశ్లేషణలు ఉన్నాయి.

ఇదంతా ఎందుకంటే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒక మీడియా ఇంటర్వ్యూలో వైఎస్సార్ కి జగన్ కి మధ్య పోలిక చెప్పి ఆసక్తిని రేకెత్తించే కామెంట్స్ చేయడం వల్ల. ఆయన అన్నది ఏంటంటే వైఎస్సార్ ఎదురుగా వస్తే దండం పెట్టాలనిపిస్తుంది. అదే జగన్ ఎదురుపడితే దండం పెట్టడానికి మనసొప్పదు అని.

అంటే జగన్ కంటే వైఎస్సారే గొప్ప అన్నట్లుగా అయ్యన్న కామెంట్స్ ఉన్నాయన్న మాట. జగన్ ది తుగ్లక్ పాలనని కూడా ఆయ్యన్న అంటున్నారు. ఆయన దుర్మార్గంగా రాజ్యం చేస్తున్నారు అని కూడా విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి జగన్ని విమర్శించాలి అంటే వైఎస్సార్ మంచివాడు, దండాలు పెడతామని తమ్ముళ్ళు చెప్పుకోవడమే ఇక్కడ విశేషం.

అయితే జగన్ని ఏమనాలో తెలియక ఆయన తండ్రిని ప్రస్తావనకు తెచ్చి తక్కువ చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదే నేతలు నాడు వైఎస్సార్ని ని కూడా చాలా ఘాటుగా విమర్శించిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి జగన్ కి దండం పెట్టాలనిపించదు అని తన మనసులో మాటను అయ్యన్న చెప్పేసుకున్నారు.