పారిపోయిన వ్యక్తి చంద్రబాబు.. జగన్ కాదు

పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో చంద్రబాబు-జగన్ మధ్య తేడాని స్పష్టంగా వివరించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. లెక్కప్రకారం ఈ ఎన్నికల్ని తన హయాంలో చంద్రబాబు నిర్వహించాలని, కానీ అప్పుడు బాబు పారిపోయారని ఎద్దేవా చేశారు.…

పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో చంద్రబాబు-జగన్ మధ్య తేడాని స్పష్టంగా వివరించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. లెక్కప్రకారం ఈ ఎన్నికల్ని తన హయాంలో చంద్రబాబు నిర్వహించాలని, కానీ అప్పుడు బాబు పారిపోయారని ఎద్దేవా చేశారు. జగన్ అలా ఎన్నికలకు భయపడే వ్యక్తి కాదన్నారు.

“ఎన్నికలకు భయపడి పారిపోయే వ్యక్తి జగన్ కాదనే విషయం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల ప్రాణాలు కాపాడ్డం కోసమే ఎన్నికల్ని వాయిదా వేయమంటున్నారు తప్ప, మొత్తానికే ఎన్నికలు వద్దని చెప్పడం లేదు. 

నిజంగా చంద్రబాబుకు సిగ్గు-గౌరవం ఉంటే ఇలాంటి ప్రచారం చేయడు. ఎందుకంటే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగాల్సిన ఎన్నికలివి. అప్పుడు దమ్ము-ధైర్యం లేక ఎన్నికలు పెట్టకుండా పారిపోయిన వ్యక్తి ఈ చంద్రబాబు.”

రేపటి సుప్రీంకోర్టు విచారణపై కూడా రోజా తన వ్యక్తిగత అభిప్రాయాన్నివెలుబుచ్చారు. వ్యాక్సినేషన్ అంశాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

“వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎన్నికలు పెట్టొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఎవ్వరికైనా ప్రజల ప్రాణాలు ముఖ్యం. అలా కాకుండా ఎన్నికలు పెట్టాల్సిందేనంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే.. కచ్చితంగా ఎన్నికలకు వెళ్తాం. న్యాయస్థానాల్ని మేం గౌరవిస్తాం. ఎన్నికలకు సీఎం జగన్ భయపడరు.”

నిమ్మగడ్డ లాంటి ఎన్నికల కమిషనర్ ను తన జీవితంలో చూడలేదన్నారు రోజా. ప్రజలు, ఉద్యోగుల ప్రాణాల్ని కూడా పట్టించుకోకుండా ఎన్నికలకు వెళ్తున్న ఇలాంటి ఎలక్షన్ కమిషన్ ను ఎప్పుడూ చూడలేదన్నారు.

దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో?

ఏపీలో ఈ ప‌రిస్ధితి అవాంఛ‌నీయ‌మైన‌ది!