వైసీపీ మీద విశాఖ అక్టోపస్ అక్కసు?

వైసీపీ సర్కార్ మరో నాలుగేళ్ళు అధికారంలో ఉంటే ఏపీ సర్వనాశనం అవుతుంది. అందువల్ల ఢిల్లీ నాయకత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని విశాఖ అక్టోపస్ మాజీ ఎంపీ సబ్బం హరి అంటున్నారు. ఇక్కడ మరో మాట…

వైసీపీ సర్కార్ మరో నాలుగేళ్ళు అధికారంలో ఉంటే ఏపీ సర్వనాశనం అవుతుంది. అందువల్ల ఢిల్లీ నాయకత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని విశాఖ అక్టోపస్ మాజీ ఎంపీ సబ్బం హరి అంటున్నారు. ఇక్కడ మరో మాట ఆయన వాడారు. ఈ రెండూ కలుపుకుంటే ఢిల్లీ నాయకత్వం ఏం చేయాలన్నది  ఆయన కోరికో అర్ధమవుతుంది.

వైసీపీలో అసంత్రుప్తి ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారట. వారంతా పిల్లి మెడలో ఎవరు గంట కడతారా అని ఎదురుచూస్తున్నారుట. అంటే వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు నేతలు రెడీగా ఉన్నారు, ఆ గంట కట్టే బాధ్యత ఢిల్లీ నాయకత్వం తీసుకోవాలని సబ్బం హరి కోరికలా కనిపిస్తోందనుకోవాలేమో.

ఇక ఏపీలో జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని యధాప్రకారం ఆయన మాట్లాడేశారు. నాలుగేళ్ల తరువాత జరిగే ఎన్నికల్లో వైసీపీ బీ ఫారం తీసుకోవడానికి కార్యకర్తలు కూడా ఉండరని జోస్యం చెప్పేశారు.

మొత్తానికి చూసుకుంటే ఒకపుడు వైసీపీలో ఉండి తరువాత బయటకు వెళ్ళిన సబ్బం హరికి జగన్ సీఎం గా ఉండడం ఇష్టం లేదన్న సంగతే బయటపడుతోంది. ఆయన దాన్ని ఎక్కడా దాచుకోలేదు కూడా. పైగా ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిన అభ్యర్ధి. మరి ఇంతకంటే ఆయన జోస్యాలు ఏం చెబుతారు అయితే ఆయన టీడీపీ అనుకూల మీడియాలో రాజకీయ విశ్లేషకుడి పాత్రలో ఇవన్నీ చెప్పుకొచ్చారు. మరి విశ్లేషణ అంటే ఇంత పచ్చపాతంతో ఉంటుందా. 

ఎన్టీఆర్ ఆత్మ యనమలని క్షమించదు

నేను జిప్ తీసినట్టు నిరూపించండి