ఆంధ్రపదేశ్‌లో ఆంధ్రజ్యోతి సిగ్గు పడింది. వైఎస్ జగన్‌ను ఏ కారణం వల్లైతే కొన్ని రోజులుగా అవహేళన చేసిందో…ఇప్పుడదే విషయాన్ని ప్రపంచ దేశాధినేతల మనోగతం అని కూడా తెలిస్తే…తమ మానప్రాణాలు పోతాయని ఆంధ్రజ్యోతి ఆలోచించింది. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్‌లో ఫస్ట్ పేజీలో ప్రాధాన్యం ఇచ్చిన వార్తకు…ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌కు వచ్చేసరికి ప్రాధాన్యం మారి పోయింది. దీనికి కారణం ఫస్ట్ పేజీలో ఇండికేషన్ ఇస్తూ క్యారీ చేసిన ఆ కథనంలోని సారాంశం వైఎస్ జగన్ ముందు చూపు, మేధావితనం ప్రపంచ దేశాధినేతల స్థాయిలో ఉందనే వాస్తవం ప్రజలకు తెలిసిపోతుందని ఆంధ్రజ్యోతి భయపడింది. ఆందుకే తెలంగాణ, ఏపీ ఎడిషన్లలో ఒకే కథనానికి వేర్వేరు ప్రాధాన్యతలివ్వడం.
“ముప్పే…అయినా తప్పదు!” అనే శీర్షికతో తెలంగాణ ఎడిషన్‌లో ఫస్ట్ పేజీలో ఇండికేషన్ ఇచ్చి, 8వ పేజీలో కథనం ప్రచురించారు. ఫస్ట్ పేజీలో ఆ కథనంలో సారాంశాన్ని తెలిపే మరికొన్ని ఉప శీర్షికలు కూడా ఇచ్చారు. అవి…కరోనాతో సహజీవనం సాగించా ల్సిందే!; ప్రపంచ దేశాధినేతల మనోగతం; ఐరోపాలో లాక్‌డౌన్ ఆంక్షలకు తెర; క‌్రమంగా తెరచుకుం టున్న షాపులు, బీచ్‌లు ; ఫ‌్రెంచ్ పాఠశాలల్లో 70 వైరస్ కేసులు ; అమెరికాలో బార్లు కిటకిట ; చర్చి ప్రార్థనలకు వాటికన్ పచ్చ జెండా ; ఆఫ్రికాలో మసీదులు ఓపెన్ …అని చక్కగా ఇచ్చారు. ఇక 8వ పేజీలో “48 లక్షల మందికి మహమ్మారి” శీర్షికతో వార్త ఇచ్చారు. అలాగే “ప్రపంచ వ్యాప్తంగా 3.18 లక్షల చావులు” అంటూ ఉప శీర్షిక ఇచ్చారు. ఇదే హెడ్డింగ్‌తో ఏపీలో 8వ పేజీలో క్యారీ చేశారు.
ఏ వార్త ఎక్కడ పెట్టాలి? దేనికి ప్రాధాన్యం ఇవ్వాలనేది ఆ మీడియా సంస్థ ఎడిటోరియల్ బోర్డు నిర్ణయిస్తుంది. ఒకరి ప్రాధాన్యాలను మరొకరు ప్రశ్నించజాలరు. కానీ అభ్యంతరం ఎక్కడంటే….పాలకులను బట్టి ప్రాధాన్యతలు మారడంపైనే. ఏపీ సీఎం జగన్ బహుశా ప్రపంచంలోనే మొట్ట మొదటసారిగా కరోనాతో కలిసి జీవించాల్సిందేనని ప్రకటించారు. దీన్ని ఏపీలోని అన్ని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా తప్పు పడుతూ కథనాలు ప్రచురించారు, ప్రసారం చేశారు.
నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. రెండు వారాల క్రితం జగన్ చెప్పిన ఆ మాటే ఇప్పుడు వేద వాక్కైంది. ఒక వేళ సీఎంగా చంద్రబాబే ఉండి ఉంటే…ఇదే ఆంధ్రజ్యోతి “ప్రపంచ మార్గనిర్దేశకుడు బాబు” అని ప్రచురించే వారు కాదా? ఇప్పుడు బాబు ప్రతిపక్ష నేత కాబట్టి ప్రాధాన్యాలు మారాయి. కనీసం కరోనా లాంటి విపత్తు సమయంలో రాజకీయాలు, వ్యక్తిగత విద్వేషాలను పక్కన పెట్టి ప్రజలకు పనికొచ్చే ఇలాంటి అంశాలను పత్రికల్లో ప్రచురిస్తే అందరి మన్ననలు పొందుతారు.
జగన్ విషయంలో చూపిన అత్యుత్సాహమే నేడు ఏపీలో ఆంధ్రజ్యోతికి తలదించుకునేలా చేసింది. ప్రపంచ దేశాధినేతల మనోగతం జగన్ ఆలోచనలను ప్రతిబింబిస్తోందనే నిజాన్ని బహిరంగపరచడానికి ఆంధ్రజ్యోతికి మనసు రాలేదు. ఎంత సేపూ జగన్ అజ్ఞానం అపారమని సమాజానికి చూపాలనే తహతహలో తమ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ నిజం నిప్పులాంటిది.
అదెక్కుడున్నా ఏదో ఒక రూపంలో బయటికొస్తుంది. జగన్ చెప్పింది నిజమేనని ఆంధ్రజ్యోతి మనస్సాక్షికి తెలుసు. అదే సమయంలో జగన్ మాటలను వక్రీకరించానని కూడా ఆ పత్రికకు తెలుసు. ఆ రెండు నిజాలు తెలియడం వల్లే నేడు కరోనాతో సహజీవనం సాగించాల్సిందేనని ఏపీలో ధైర్యంగా ప్రకటించడానికి మొహం చెల్లలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లలో వేర్వేరు ప్రాధాన్యాలతో కథనాన్ని ప్రచురించేటప్పుడు ఎడిటోరియల్ సిబ్బంది పడిన మానసిక వేదనను సానుభూతితో అర్థం చేసుకుం టూ జాలి చూపడం తప్ప మరేం చేయగలం?
-సొదుం