మోదీజీ.. వ్యాక్సినేషన్ కు ముందుకొస్తారా..?

ఇతర దేశాల అధినేతలంతా ముందు తాము కరోనా వ్యాక్సిన్ వేయించుకుని ప్రజలకు భరోసానిచ్చారు. అపోహలు తొలిగించే ప్రయత్నం చేశారు. మరి భారత్ లో కూడా ప్రధాని మోదీ, అతని మంత్రివర్గ సహచరులు టీకా వేయించుకోడానికి…

ఇతర దేశాల అధినేతలంతా ముందు తాము కరోనా వ్యాక్సిన్ వేయించుకుని ప్రజలకు భరోసానిచ్చారు. అపోహలు తొలిగించే ప్రయత్నం చేశారు. మరి భారత్ లో కూడా ప్రధాని మోదీ, అతని మంత్రివర్గ సహచరులు టీకా వేయించుకోడానికి ముందుకొస్తారా? ప్రజలకు వేయడానికి ముందే మోదీ టీమ్ టీకా వేయించుకునే సాహసం చేస్తుందా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ.

వాస్తవానికి కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ మొదట కొవిషీల్డ్ అనే టీకా పేరుని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి సిఫార్సుచేసింది. ఆ వెంటనే గంటల వ్యవధిలో కొవాక్సిన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అప్పటికి మూడో దశ ప్రయోగాలు పూర్తి కాలేదనే ఉద్దేశంతో దాన్ని పక్కనపెట్టింది నిపుణుల కమిటీ.

కారణాలు తెలియవు కానీ, టీకా పేరుని పక్కనపెట్టిన నిపుణుల కమిటీ హడావిడిగా కొవిషీల్డ్ తో పాటు, కొవాక్సిన్ పేరు కూడా డీసీజీఐకి సిఫార్సు చేసింది. వెనువెంటనే డీసీజీఐ రెండు టీకాలకు ఆమోదం తెలపడం, ప్రధాని సహా కేంద్ర మంత్రులు సంతోషం వ్యక్తం చేయడం అందరికీ తెలిసింది.

ఇక్కడే కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తప్పుపడుతోంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ని భారత్ లో సీరం ఇన్ స్టిట్యూట్ సంస్థ తయారు చేసింది. దీన్ని ఇతర దేశాలు ఆమోదించాయి, అక్కడ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది కూడా.

కానీ కొవాక్సిన్ ఇంకా మూడో దశ ప్రయోగాల్లోనే ఉంది. దానికి అత్యవసరవ వినియోగ అనుమతి ఎందుకిచ్చారని ప్రశ్నిస్తున్నారు చాలామంది.. ఇంకో అడుగు ముందుకేసి మోదీని టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రజల్లో అపోహలున్నాయని, అవి తొలగిపోవాలంటే మోదీ, అతని సహచరులు కొవాక్సిన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. భారత్ బయోటెక్ యాజమాన్యంతో బంధుత్వం ఉన్న ఈనాడు, ఇతర లావాదేవీలు ఉన్న చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం కొవాక్సిన్ పేరుని హైలెట్ చేస్తోంది. కొలిషీల్డ్ అన్ని విధాలుగా అర్హత పొందినప్పటికీ.. కోవాక్సిన్ కు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పత్రికలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కథనాలు వండివారుస్తున్నాయి.

చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదు

దేవుడి పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు