అప్పలకొండ-జోగినాధం: స్టీలు ప్లాంటు గొడవ

అప్పలకొండ: ఒరేయ్ జోగి! స్టీల్ ప్లాంటు గొడవంట ఏంట్రా? Advertisement జోగినాధం: పేపర్ చదవ్వేంట్రా?! ప్రతీదీ నన్నడుగుతావు! అప్పలకొండ: నువ్వుంటే పేపర్లెందుకెహె!!  జోగినాధం: ఏముందీ…కేంద్రం వాళ్లు ప్రైవేట్ చేసేస్తారంటా.. అప్పలకొండ: వార్నీ…మరి మన జగన్…

అప్పలకొండ: ఒరేయ్ జోగి! స్టీల్ ప్లాంటు గొడవంట ఏంట్రా?

జోగినాధం: పేపర్ చదవ్వేంట్రా?! ప్రతీదీ నన్నడుగుతావు!

అప్పలకొండ: నువ్వుంటే పేపర్లెందుకెహె!! 

జోగినాధం: ఏముందీ…కేంద్రం వాళ్లు ప్రైవేట్ చేసేస్తారంటా..

అప్పలకొండ: వార్నీ…మరి మన జగన్ బాబు ఏం చేత్తనాడు?

జోగినాధం: ఆలోచన విరమించుకోమని ప్రధాన మంత్రికి ఉత్తరం రాసాడు. 

అప్పలకొండ: ఉత్తర దిక్కుకి ఉత్తరం రాస్తే ఫలితం ఉండదురా…తూర్పు తిరిగి దండం పెట్టమంటారు..ఆళ్లేమీ పట్టించుకోరు. 

జోగినాధం: అబ్బో చాలా తెలుసురా నీకు! మరేం చెయ్యాలంటావ్?

అప్పలకొండ: గొడవ చెయ్యాలి…పార్టీలు పక్కనపెట్టి ఆంధ్రావోడి ఆస్తి కోసం ఆంధ్రనాయకులంతా పోరాడాలి. 

జోగినాధం: అందరూ అదే కోరుకుంటున్నారు…ముఖ్యమంత్రి ముందస్తుగా లెటర్ రాసాడు..కానీ ఒక నాయుడు సగం మాట్లాడి కూచున్నాడు. ఇంకొక నాయుడు ఇంకా నోరు మెదపలేదు. 

అప్పలకొండ: ఎవరాళ్లు?

జోగినాధం: మన చంద్రబాబు నాయుడు ప్రెస్ మీటు ఒకటి పెట్టి షరా మామూలుగా జగన్ ని తిట్టి సైలెంట్ అయిపోయాడు. మోడిని ఒక్క మాటనలేదు. ఇక పవన్ నాయుడు ఈ టాపిక్ మీద మౌనవ్రతంలో ఉన్నాడు.

అప్పలకొండ: అమ్మనీ..నాయుళ్ళిద్దరూ ఈ సమయంలో కూడా రాజకీయమంటే ఎట్టారా? ఇప్పుడు కూడా జగన్ మీదేనా కోపం?

జోగినాధం: జగన్ మీదం కోపం కాదురా…మోడి అంటే భయం. తడిసిపోతున్నట్టుంది ఇద్దరికీ..ఒక్క మాట మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే. 

అప్పలకొండ: అంతేనంటావా?

జోగినాధం: లేకపోతే ఏంట్రా? ఈ సైలెన్సుని ఏమనుకోవాలి?