ఆ ప్ర‌క‌ట‌న‌తో టీడీపీ డీలా

జ‌న‌సేన మీటింగ్ వాయిదా ప‌డ‌డంతో టీడీపీ డీలా ప‌డింది. త‌మ అధినేత చంద్ర‌బాబు ప్రేమ ప్ర‌తిపాద‌న‌కు జ‌న‌సేన నుంచి క్లారిటీ వ‌స్తుంద‌నే ఆశ‌తో ఉన్న టీడీపీకి ఒకింత నిరాశే ఎదురైంది. ఆదివారం జ‌న‌సేన పార్టీ…

జ‌న‌సేన మీటింగ్ వాయిదా ప‌డ‌డంతో టీడీపీ డీలా ప‌డింది. త‌మ అధినేత చంద్ర‌బాబు ప్రేమ ప్ర‌తిపాద‌న‌కు జ‌న‌సేన నుంచి క్లారిటీ వ‌స్తుంద‌నే ఆశ‌తో ఉన్న టీడీపీకి ఒకింత నిరాశే ఎదురైంది. ఆదివారం జ‌న‌సేన పార్టీ కార్య‌నిర్వాహ‌క స‌మావేశం నిర్వ‌హించాల‌ని ఆ పార్టీ ముందుగా నిర్ణ‌యించింది. క్రిస్మ‌స్ సెల‌వుల‌ను ముగించుకుని ర‌ష్యా నుంచి జ‌న‌సేనాని ప‌వ‌న్ తిరిగి వ‌చ్చారు.

ఈ లోపు ఏపీలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. జ‌న‌సేన‌తో పొత్తుకు సిద్ధంగా ఉన్న‌ట్టు టీడీపీ అధినేత చంద్ర‌బాబు బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. జ‌న‌సేన‌తో త‌మ‌తో ఒన్‌సైడ్ ల‌వ్ అంటూ చంద్ర‌బాబు న‌ర్మ‌గర్భ వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌య‌మై జ‌న‌సేన నుంచి ఎలాంటి స్పంద‌నా రాలేదు.

దీంతో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణే పొత్తుపై తేల్చి చెబుతార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇందుకు ఇవాళ నిర్వ‌హించే పార్టీ కార్య‌నిర్వాహ‌క స‌మావేశం వేదిక అవుతుంద‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్తలు, నాయ‌కులు చెబుతూ వ‌చ్చారు. అయితే క‌రోనా ఉధృత‌మ‌వుతున్న నేప‌థ్యంలో ముంద‌స్తు జాగ్ర‌త్త‌లో భాగంగా స‌మావేశాన్ని వాయిదా వేసిన‌ట్టు ఆ పార్టీ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. 

తిరిగి స‌మావేశం ఎప్పుడు నిర్వ‌హించేది తెలియ‌జేస్తామ‌ని పార్టీ ప్ర‌క‌టించింది. అంత వ‌ర‌కూ పొత్తు స‌స్పెన్ష‌న్ కొన‌సాగుతూనే ఉంటుందా? అని టీడీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.