ఈ టీడీపీ నేతలకు ఏమైంది? ఎందుకు సిగ్గుపడరు?

అధికారంలో ఉన్నప్పుడు అప్పనంగా నామినేటెడ్ పదవులు అందుకున్న తెలుగుదేశం నేతలు, పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇంగితజ్ఞానం కూడా కోల్పోయినట్టు ఉన్నారు. అందుకున్న నామినేటెడ్ పదవుల్ని వదులుకోవాలని, భేషరతుగా రాజీనామాలు చేసి, ఆ పదవుల…

అధికారంలో ఉన్నప్పుడు అప్పనంగా నామినేటెడ్ పదవులు అందుకున్న తెలుగుదేశం నేతలు, పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇంగితజ్ఞానం కూడా కోల్పోయినట్టు ఉన్నారు. అందుకున్న నామినేటెడ్ పదవుల్ని వదులుకోవాలని, భేషరతుగా రాజీనామాలు చేసి, ఆ పదవుల నుంచి తప్పుకోవాలనే ధ్వాస కూడా లేకుండా పోతోంది. మొన్నటికిమొన్న టీటీడీ పాలకమండలి ఛైర్మన్ పదవ నుంచి తప్పుకోవడానికి పుట్టా సుధాకర్ ఎంత మంకుపట్టు పట్టారో అంతా చూశాం. ఇప్పుడు వర్ల రామయ్య వంతు వచ్చింది.

తనను తాను టీడీపీకి వీరాభిమానిగా, చంద్రబాబుకు వినయ విధేయ శిష్యుడిగా చెప్పుకునే వర్ల రామయ్య.. మొత్తానికి కిందామీద పడి ఆర్టీసీ చైర్మన్ పదవిని సంపాదించారు. టీడీపీ అధికారంలో ఉన్న రోజుల్లో బాగానే అధికారం చలాయించారు. అంతా బాగానే ఉంది కానీ వైసీపీ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత కూడా తనే ఛైర్మన్ అంటూ డైలాగ్స్ చెప్పడం మాత్రం బాగాలేదు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటే.. అధికారికంగా కూడా ఆయన పదవీకాలం ముగిసింది.

బాబు హయాంలో ఆర్టీసీ చైర్మన్ గా(నాన్-అఫీషియో) నియమితుడైన వర్ల రామయ్య పదవీకాలం ఎప్పుడో ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 26తోనే ఆయన టెర్మ్ ముగిసిందని రికార్డులు చెబుతున్నాయి. అయినప్పటికీ వర్ల రామయ్య మాత్రం సిగ్గులేకుండా ఇంకా తన నామినేటెడ్ పదవిని పట్టుకొని వేళాడుతున్నారు. అధికారులతో మీటింగ్స్ పెడుతున్నారు. ఎందుకు తప్పుకోవాలని రివర్స్ లో ప్రశ్నిస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్ల రామయ్యకు నోటీసులు జారీచేసింది.

రూల్స్ ప్రకారం చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే తప్పించాల్సి ఉంటుందని చెబుతూ నెలరోజుల గడువు ఇచ్చింది. అసలు ఇంతవరకు తెచ్చుకోవడమే తప్పు. ప్రభుత్వం మారిన వెంటనే పదవులకు రాజీనామాలు చేయాలి. గతంలో టీటీడీ ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ కూడా ఇలానే సిగ్గులేకుండా వ్యవహరించారు. చివరికి తనుకుతానుగా రాజీనామా చేసేలా వైసీపీ సర్కార్ కొన్ని పరిస్థితులు సృష్టించాల్సి వచ్చింది.

కేవలం వర్ల రామయ్య, సుధాకర్ మాత్రమే కాదు.. టీడీపీకి చెందిన చాలామంది నేతలు ఇదే విధంగా ఇంకా తమదే రాజ్యం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మొన్నటికిమొన్న చింతమనేని విషయంలో ఏం జరిగిందో అంతా చూశారు. వైసీపీ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ, తన నియోజకవర్గంలో తనదే అధికారం అన్నట్టు వ్యవహరించారు చింతమనేని. చివరికి పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారు. మరోనేత చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యవహారశైలి కూడా ఇలానే తయారైంది.

టీడీపీ అధికారాన్ని కోల్పోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు అయ్యన్నపాత్రుడు. తనదే రాజ్యం అన్నట్టు, ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రభుత్వం, మంత్రులు, ఐపీఎస్ అధికారులపై నోరుపారేసుకున్నారు. ఇక్కడ “నోరు పారేసుకోవడం” అనే పదం చాలా చిన్నది. పేపర్ పై పెట్టడానికి కూడా వీల్లేని విధంగా బూతులు వాడారు. దీంతో ఇప్పుడు ఈయనపై కూడా కేసు నమోదైంది. విశాఖ వైసీపీ నేత విజయనిర్మాల భర్త వెంకట్రావ్ ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదుచేశారు పోలీసులు. ఐపీసీ 153ఏ, 506, 503 కింద ఈయనపై కేసులు పడ్డాయి. అయ్యన్నపాత్రుడు క్షమాపణలు చెప్పకపోతే ఏ క్షణానైనా అరెస్ట్ తప్పకపోవచ్చు.

నిజానికి వీళ్లంతా ఇలా రెచ్చిపోవడానికి కారణం వాళ్ల బాస్ చంద్రబాబు, చినబాస్ లోకేష్. వీళ్ల అడుగుజాడల్లోనే వీళ్లిలా నడుస్తున్నారు. అర్థంపర్థం లేని ఆరోపణలతో చంద్రబాబు నోటికొచ్చినట్టు వాగుతుంటే.. కనీస పరిజ్ఞానం లేకుండా లోకేష్ ఇష్టమొచ్చినట్టు ట్వీట్లు పెడుతున్నారు. వీళ్ల అండ చూసుకునే అనుచరగణం ఇలా రెచ్చిపోతోంది. సిగ్గులేకుండా ప్రవర్తిస్తోంది. 

రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్తున్నా.. సైరా డైరెక్టర్