వీడియో దెబ్బ: ఎక్కడి నేతలక్కడే గప్ చుప్

టీడీపీ నేతలంతా తేలు కుట్టిన దొంగల్లా మారిపోయారు. చంద్రబాబు సహా.. బాధితుడు లోకేష్, బాధ పెట్టిన అచ్చెన్న.. అందరికీ నెప్పి తెలుస్తూనే ఉంది. అయితే అచ్చెన్న మినహా ఎవ్వరూ కిక్కురుమనలేదు. యధావిధిగా అచ్చేన్నాయుడు అది…

టీడీపీ నేతలంతా తేలు కుట్టిన దొంగల్లా మారిపోయారు. చంద్రబాబు సహా.. బాధితుడు లోకేష్, బాధ పెట్టిన అచ్చెన్న.. అందరికీ నెప్పి తెలుస్తూనే ఉంది. అయితే అచ్చెన్న మినహా ఎవ్వరూ కిక్కురుమనలేదు. యధావిధిగా అచ్చేన్నాయుడు అది ఫేక్ వీడియో అంటూ వక్రీకరించారు. 

లోకేష్ కి తనకు మధ్య సంబంధాలు చెడగొట్టడానికి చూస్తున్నారని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికల వేళ, టీడీపీ విజయావకాశాలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారంటూ పనిలో పనిగా గొప్పలు చెప్పుకున్నారు. కళ్ల ముందు అంత స్పష్టంగా వీడియో సాక్ష్యం కనపడుతుంటే.. దాన్ని ఫేక్ అనడం, మార్ఫింగ్ అనడం అతడికే చెల్లింది.

బ్రీఫ్డ్ మీ ఎంత ఫేకో.. బొక్కలో పార్టీ అంతే ఫేక్..

గతంలో ఓటుకు కోట్లు కుంభకోణంలో చంద్రబాబు ఫోన్ వాయిస్ బయటకొచ్చింది. “మనవాళ్లు బ్రీఫ్డ్ మీ” అంటూ చంద్రన్న గొంతు స్పష్టంగా వినిపించింది. అయితే దాన్ని కూడా మిమిక్రీ అంటూ తిప్పికొట్టారు బాబు. 

ఇప్పుడు అచ్చెన్న కూడా అదే అస్త్రాన్ని బయటకు తీశారు. ఈ విషయంపై రచ్చ చేసేందుకు బాబుకి కూడా అవకాశం లేదు. బ్రీఫ్డ్ మీ ఎంత ఫేకో, పార్టీలేదు, బొక్కాలేదు అనేది కూడా అంతే ఫేక్ అనే విషయం ప్రజలకు తెలుసు. అందుకే ఎవరూ దీనిపై నోరు మెదపలేదు.

పచ్చ నేతలంతా గప్ చుప్..

అందరిలో ఆవేశం ఉంది, ఇలా బయటపడితే ఎలా అని అచ్చెన్నాయుడు చెప్పిన మాట అక్షర సత్యం అని అంతర్గతంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఒప్పుకుంటున్నారు. అయితే ఎక్కడా ఎవరూ బయటపడలేదు. లీకైన వీడియోపై స్పందించడానికి ముందుకు రాలేదు. 

సహజంగా.. వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టే బ్యాచ్ కూడా అచ్చెన్నాయుడికి మద్దతు తెలపకపోవడం విశేషం. ఆ వీడియో గొడవని కేవలం అచ్చెన్న, లోకేష్ మధ్య ఉన్న వ్యవహారంగా చూడాలని, దానికి పార్టీకి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు మిగతా నేతలు. ఏ విషయంపై అయినా అనర్గళంగా స్పందించే పచ్చబ్యాచ్ సైతం.. ఆ వ్యవహారంపై స్పందించకుండా దాటవేస్తుండటం విశేషం.

లోకేష్ టార్గెట్ అయినట్టేనా..?

ఇప్పటి వరకు లోకేష్ కేవలం అసమర్థుడని, పార్టీ వ్యవహారాలపై పట్టులేదని అందరూ అనుకుంటున్నారు. అయితే తాజా వీడియోతో.. లోకేష్ గ్రూపులు కడుతున్నారని, వాడుకుని వదిలేసే రకం అనే విషయం కూడా రుజువైంది. లోకేష్ పై ఎవరీకి నమ్మకం లేదని, అలాంటి వారి వల్లే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని అచ్చెన్న కూడా ఒప్పుకోవడంతో లోకేష్ పూర్తిగా కార్నర్ అయ్యారు. 

ఈ వీడియో బయటకు రావడం వల్ల ఒకరకంగా అచ్చెన్నాయుడిపై పార్టీలో సింపతీ పెరిగింది. లోకేష్ పక్షపాత ధోరణి, అసమర్థత.. మరోసారి బయటపడింది. లోకేష్ వ్యవహారం కావడంతో పార్టీ నేతలెవరూ కిక్కురుమనడం లేదు.