ఫైబ‌ర్ గ్రిడ్ స్కామ్.. టీడీపీ నేత‌లు ఫుల్ కాన్ఫిడెన్స్!

అవినీతి జ‌ర‌గ‌లేదు.. అన‌డం లేదు, నిరూపించ‌లేర‌ని మాత్ర‌మే అంటోంది టీడీపీ. ఇప్ప‌టి వ‌ర‌కూ  వైఎస్ జ‌గ‌న్  ప్ర‌భుత్వం త‌మ పై అనేక ర‌కాల బుర‌ద జ‌ల్లింద‌ని, అయితే నిరూపించ‌లేక‌పోయింద‌ని టీడీపీ నేత ప‌ట్టాభి అంటున్నారు.…

అవినీతి జ‌ర‌గ‌లేదు.. అన‌డం లేదు, నిరూపించ‌లేర‌ని మాత్ర‌మే అంటోంది టీడీపీ. ఇప్ప‌టి వ‌ర‌కూ  వైఎస్ జ‌గ‌న్  ప్ర‌భుత్వం త‌మ పై అనేక ర‌కాల బుర‌ద జ‌ల్లింద‌ని, అయితే నిరూపించ‌లేక‌పోయింద‌ని టీడీపీ నేత ప‌ట్టాభి అంటున్నారు. ఇప్పుడు ఫైబ‌ర్ నెట్ లో 121 కోట్ల రూపాయ‌ల మేర అవినీతి జ‌రిగింద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అంటోంద‌ని, అయితే 121 పైస‌ల అవినీతిని కూడా నిరూపించ‌లేర‌ని ప‌ట్టాభి ముందుగానే తేల్చి చెబుతున్నారు.

ఈ టీడీపీ నేత మాట‌ల్లో.. అవినీతి జ‌ర‌గ‌లేద‌ని చెప్ప‌డం మాటెలా ఉన్నా, నిరూపించ‌లేర‌న్న కాన్ఫిడెన్స్ మాత్రం కొట్టుకొచ్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది. త‌మ హ‌యాంలో అవినీతి జ‌ర‌గ‌లేదు అనే ప‌డిక‌ట్టు ప‌దాన్ని కూడా ఉప‌యోగిస్తున్న‌ట్టుగా లేరు టీడీపీ నేత‌లు. నిరూపించ‌లేర‌ని మాత్రం కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌భుత్వం తెలుగుదేశం హ‌యాంలోని వివిధ అవినీతి అంశాల‌ను క‌దిపినా.. ఎక్క‌డిక్క‌డ కోర్టుల్లో స్టేలు తెచ్చుకుని, బెయిల్స్ తెచ్చుకుని టీడీపీ నేత‌లు తాము శుద్ధ‌పూస‌ల‌మ‌ని అంటున్నారు.

ఈఎస్ఐ స్కామ్ లో నాటి మంత్రి అచ్చెన్నాయుడును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆయ‌న గంట‌ల వ్య‌వధిలోనే ఆసుప‌త్రికి వెళ్లిపోయారు. నెల‌ల పాటు ఆసుప‌త్రిలోనే గ‌డిపి, బెయిల్ వ‌చ్చిన మ‌రుస‌టి రోజున ఆయ‌న ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇక రాజ‌ధాని అంశంలో కూడా టీడీపీ ముందే కోర్టుల‌ను ఆశ్ర‌యించింది. విచార‌ణ జ‌ర‌గ‌డానికే వీల్లేద‌నే వాద‌న‌ను వినిపించింది.

ఇప్పుడు ఫైబ‌ర్ గ్రిడ్ స్కామ్ లో కూడా నిరూపించ‌లేరు.. అంటూ టీడీపీ నేత‌లు స‌వాళ్లు విసురుతున్నారు. సీఐడీ అధికారులు ఇప్ప‌టి వ‌ర‌కూ ఇద్ద‌రికి నోటీసులు ఇచ్చారు. మ‌రి వారి అరెస్టుల వ‌ర‌కూ అయినా వ్య‌వ‌హ‌రం వ‌స్తుందా?  లేక ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారా? త‌దుప‌రి చ‌ర్య‌ల‌న్నింటినీ ఆప‌మని టీడీపీ వాళ్లు కోర్టుల‌కు ఎక్కుతారో చూడాల్సి ఉంది.

స్టేలు, త‌దుప‌రి చ‌ర్య‌లు ఆపాల‌నే పిటిష‌న్ల‌ను ఆయుధాలుగా మ‌లుచుకుంటే.. ఈ స్కామ్ లో కాని, ఎవ‌రి పాత్ర బ‌య‌ట‌ప‌డుతుందబ్బా? బ‌హుశా ఈ కాన్ఫిడెన్స్ తోనే.. 'నిరూపించ‌లేరు' అంటూ టీడీపీ నేత‌లు స‌వాళ్లు విసురుతున్నారేమో!