మరికాసేపట్లో మరో వికెట్ డౌన్

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వెంటిలేటర్ పై ఉందనే విషయం అందరికీ తెలిసిందే. గెలిచినవే అతి తక్కువ సీట్లు. అందులో మళ్లీ అసంతృప్త ఎమ్మెల్యేలు. ఈ క్రమంలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిన సంగతి…

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వెంటిలేటర్ పై ఉందనే విషయం అందరికీ తెలిసిందే. గెలిచినవే అతి తక్కువ సీట్లు. అందులో మళ్లీ అసంతృప్త ఎమ్మెల్యేలు. ఈ క్రమంలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా వైసీపీకి జై కొడుతున్నారు. చంద్రబాబుకు ఝలక్ ఇస్తున్నారు.

విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ టీడీపీకి దాదాపు గుడ్ బై చెప్పేశారు. కొన్నాళ్లుగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్న గణేశ్.. మరికాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ ను కలవబోతున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి తన మద్దతు ఉంటుందని భేషరతుగా తెలియజేస్తారు.

జగన్ విధించుకున్న స్వీయ నియంత్రణకు తగ్గట్టు… వాసుపల్లి కూడా వైసీపీలో చేరరు. అలాఅని టీడీపీలో కూడా కొనసాగరు. ఆల్రెడీ టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి ఏర్పరిచిన బాటలోనే గణేశ్ కూడా నడుస్తారు. తన పార్టీలో చేరాలంటే అన్ని రకాల పదవులకు రాజీనామా చేసిన తర్వాత మాత్రమే కండువా కప్పుతానని జగన్, అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.. టీడీపీకి పూర్తిగా దూరం. అలా అని వాళ్లు వైసీపీలో చేరలేదు. టీడీపీకి దూరంగా ఉంటూనే వైసీపీకి మద్దతు ప్రకటించారు. నియోజకవర్గాల్లో కూడా వైసీపీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇకపై గణేష్ కూడా ఇలానే వ్యవహరించబోతున్నారు.

విశాఖలో కీలక నేత, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితుడు వాసుపల్లి గణేష్. అలాంటి వ్యక్తి వైసీపీలోకి రావడంతో, ఇప్పుడు అందరి చూపు మరోసారి గంటా శ్రీనివాసరావుపై పడింది. ఆయన మాత్రం ఎప్పట్లానే ఇటు టీడీపీకి, అటు వైసీపీకి సమదూరం పాటిస్తున్నారు. మొత్తమ్మీద వాసుపల్లి గణేష్, వైసీపీకి జై కొట్టడంతో.. అనధికారికంగా టీడీపీ కౌంట్ 19కి పడిపోయింది. 

జడ్జీల కూతుర్లు కూడా చట్టంముందు సమానులే