తెలంగాణలో రాజకీయాలు షరా వేగం గా మారుతున్నాయి. నిన్న మునుగోడు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. చెప్పులు అందించడంపై వివాదం నెలకొంది. ఇందులోకి అత్మ గౌరవం వచ్చేసింది. చెప్పులు అందించడంపై అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తూ.. తెలంగాణ అత్మ గౌరవం గుజరాత్ నాయకుల దగ్గర తాకట్టు పెట్టరంటూ ఆ ఘటనను ఖండించారు.
ఈ ఘటన వైరల్ కావడంతో.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లడుతూ కేంద్ర హెంశాఖ మంత్రి 'అమిత్ షా పెద్ద మనిషి… ఆయనకు చెప్పులు తీసిస్తే తప్పేముంది' అని అన్నారు. సీఎం కేసీఆర్ కూడా ప్రణబ్, నరసింహన్ కు కాళ్లు మొక్కరంటూ తన ఘటనను సమర్థించుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ ప్రమేయం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అందుకే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై ఆరోపణలు వస్తున్నాయన్నారు. పంజాబ్ లో లిక్కర్ సిండికేట్ చేసేందుకు కేసీఆర్ ఆ రాష్ట్రానికి వెళ్లినట్టుగా అనుమానం వస్తుందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు లిక్కర్ మాఫియాకు సంబంధించిన వ్యక్తులను కలిశారా లేదా అని ప్రశ్నించారు.
లిక్కర్ మాఫియాలో కాంగ్రెస్ వ్యక్తుల కూడా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే లిక్కర్ దందా చేస్తున్నారన్నారు. లిక్కర్ స్కాంపై సమగ్ర విచారణ జరిపితే నిజాలు బయటపడతాయన్నారు. లిక్కర్ మాఫియాపై కేటీఆర్ ఎందుకు ట్వీట్ చేయలేదన్నారు.