తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న మునుగోడు ఉప ఎన్నికల్లో జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ, తమ సన్నిహిత పార్టీ అని చెప్పుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఎవరి వైపు నడుస్తుంది అనేది అందరికీ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా కీలకమే. ఎన్నికలకు ఐదు రోజులే ఉన్న ఈ ఇరు పార్టీలు ఎటు తెల్చలేకపోవడంతో క్యాడర్ అయోమయంలో ఉన్నారు.
టీడీపీ అధినేతకు బీజేపీ అంటే అమితమైన ప్రేమ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే అమితమైన భయం, అలాగే కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనకు ఉన్న గొప్ప శిష్యబృందంలో ఒకరు.. బహుశ ఎవరికి నొప్పించకుండా సైలెంట్ గా ఉండటమా లేక ఎన్నికల ముందు రోజు లోలోపల నాయకులకు అదేశాలు జారీ చేయడం అనేది జరుగుతుందంటూన్నారు టీటీడీపీ నాయకులు.
అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎంత లేదన్నా తను చెప్పితే ఒక వందో, రెండు వందలో ఓట్లు తప్పక పడుతాయి అనేది తెలిసిందే. మారి పవన్ కళ్యాణ్ కూడా మునుగోడులో ఎవరికి మద్ధతు ఇవ్వబోతున్నారనేది తెలియడం లేదు. తమ గురువును ఫాలో అవ్వడంమా లేక చివరి వరకు వేచిచూసి ఏదో పార్టీకి మద్ధతు ఇవ్వడమా అనేది తెలియాల్సింది.
మునుగోడులో ప్రతి ఓటు కీలకమే.. ఏవరికైనా కనీసం పది మంది ఓటర్లు ఉన్నా వారికి పార్టీలు ఎంతేంత తాయిళాలు ఇస్తున్నారో చూస్తునే ఉన్నాం. అలాంటిది టీడీపీ, జనసేన పార్టీలు తమ మద్ధతుపై ఏటు తెల్చకపోవడంతో క్యాడర్ తో పాటు ఇతర పార్టీల నాయకులల్లో కూడా అసక్తి నెలకొంది. టీ.టీడీపీ, టీ.జనసేన నాయకులు మాత్రం వచ్చే సంవత్సరం జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో నిలబడి తమ సత్త చాటలాని చూస్తుంటే అధినేతలు మాత్రం మౌనని అశ్రయించడం విశేషం.