దివ్యాంగుల రిజర్వేషన్లపై సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ ఎక్స్‌లో పెట్టిన పోస్టు తీవ్ర దుమారం రేపుతోంది. సివిల్ సర్వీసెస్‌లో దివ్యాంగులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆమె పెట్టిన పోస్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆమె మాత్రం తగ్గేదే లే అనే రేంజ్‌లో దివ్యాంగుల రిజర్వేషన్లపై చర్చకు తెరలేపారు. దివ్యాంగుల రిజర్వేషన్లపై ఆదివారం ఆమె ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టు ఏంటో ముందు తెలుసుకుందాం.
‘ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసు ఉద్యోగులు ఎక్కువగా క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంటుంది. ప్రజల కష్టాలను నేరుగా వినాల్సి ఉంటుంది. దీనికి శారీరక దృఢత్వం అవసరం.. కొన్నిసార్లు కఠిన సమయాల్లో పని చేయాల్సి ఉంటుంది. వైకల్యం ఉన్న వారిని గౌరవిస్తున్నాను. కానీ వైకల్యం ఉన్న ఫైలట్‌ను విమానయాన సంస్థలు నియమించుకుంటాయా? వైకల్యం ఉన్న సర్జన్ సేవలను మీరు విశ్వసిస్తారా?’ అని స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
స్మితా పోస్టుపై ప్రముఖ మోటివేటర్, సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత తదితరులు తీవ్రంగా స్పందించారు. బాలలత స్వయంగా దివ్యాంగురాలు. ఆమె మీడియాతో మాట్లాడుతూ అంగవైకల్యం ఉన్న వారి గురించి మాట్లాడ్డానికి స్మితకు ఉన్న అర్హతలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. జ్యుడిషియరీ, పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు స్మితా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్‌లో పరిగెత్తుతూ స్మితా ఎంతకాలం పని చేశారో చెప్పాలని ఆమె నిలదీయడం గమనార్హం. అసలే వివక్షకు గురవుతున్న వికలాంగులను ఆమె మాటలు మరింత కుంగదీశాయని వాపోయారు.
కోడ్ ఆఫ్ కండెక్ట్, సివిల్ సర్వెంట్ క్రమశిక్షణ రాహిత్యం కింద స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇద్దరం సివిల్స్ పరీక్ష రాద్దామని, తనకంటే ఎక్కువ మార్కులు సాధించాలని స్మితాకు బాలలత సవాల్ విసిరారు. ఈ సందర్భంగా అంగవైకల్యంతో బాధపడుతూ విజయాలు సాధించిన జైపాల్‌రెడ్డి, స్టీఫెన్ హాకింగ్, సుదా చంద్రన్ తదితరుల గురించి ఆమె ఉదహరించారు. పదేళ్ల పాటు సీఎంవోలో పనిచేసి కనీసం అడ్మినిస్ట్రేషన్‌పై అవగాహన లేకుండా మాట్లాడటం బాధాకారమన్నారు. 24 గంటల్లోపు తన మాటలు వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రేపటిలోగా ప్రభుత్వం స్మితాపై చర్యలు తీసుకోకపోతే ట్యాంక్ బండ్‌పైన నిరసన తెలియజేస్తామని బాలలత హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో స్మితా మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. మళ్లీ ఎక్స్‌లో ఆమె ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టులో తనను విమర్శించే వారికి ఆమె నేరుగా ఒక ప్రశ్న సంధించారు. స్మితా ఏమంటారంటే…
ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్‌తో పాటు రక్షణ లాంటి రంగాల్లో దివ్యాంగుల కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదో తనను ప్రశ్నిస్తున్న వారు సమాధానం చెప్పాలని స్మితా డిమాండ్ చేయడం గమనార్హం. ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ లాగే ఐఏఎస్ కూడా అంతేకదా అని ఆమె నిలదీశారు. తన అభిప్రాయాన్ని పరిశీలించాలని హక్కుల కార్యకర్తల్ని కోరుతున్నట్టుగా ఆమె పేర్కొన్నారు. సున్నితత్వానికి తన మనసులో స్థానం లేదని ఆమె స్పష్టం చేశారు.
దివ్యాంగులనే జాలి, దయ లాంటి వాటికి తన మనసులో చోటు లేదని స్మితా సబర్వాల్ తేల్చి చెప్పారు. స్మితా లేవనెత్తిన అంశాలు కూడా విలువైనవే. స్మితా లేవనెత్తిన అంశాలపై విమర్శలు చేయడం ఓకే. అలాగే ఐఏఎస్ లాగే ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్‌లలో దివ్యాంగులకు రిజర్వేషన్లు సాధించుకోవడంపై దృష్టి సారిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దమ్ముంటే మోదీని రాజీనామా చేసి పులివెందులలొ గెలవమన్నట్టుంది ఈ బాలలత చాలెంజ్.అంగవైకల్యం ఉన్నవారి గురించి మాట్లాడతానికి కావల్సిన అర్హతల లిస్ట్ కూడా పెట్టాల్సింది
Comedy GA, she tweeted insensitivity has no place in her mind. You changed the entire meaning
స్మిత సబర్వాల్ చెప్పిన దాంట్లో తప్పేమి లేదు , తక్కువ ప్రయారిటీ ఉన్న వాటిలో రిజర్వేషన్ పొందిన వారికీ ఉద్యోగాలు ఇవ్వాలి లేకుంటే దేశం వెనుకపడిపోద్ది ఇప్పటికే మన దేశం బాగా వెనుక పడిపోయింది
జ్యుడిషియరీ, పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అని ఎక్కడ రాజ్యాంగంలో లేదు , ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే మాట్లాడొద్దు అని రాజ్యాంగం చెప్పలేదు
తనకంటే ఎక్కువ మార్కులు సాధించాలని స్మితాకు బాలలత సవాల్ విసిరారు… అంత నాలెడ్జి ఉంటే రిజర్వేషన్ అక్కర్లేదమ్మ….
జైపాల్‌రెడ్డి, స్టీఫెన్ హాకింగ్, సుదా చంద్రన్ తదితరుల గురించి ఆమె ఉదహరించారు… ఈ ముగ్గురూ వాళ్లకు ఉన్న నైపుణ్యం తో పైకి వచ్చారు, రిజర్వేషన్ తో కాదు.
అంగవైకల్యం ఉన్న వారి గురించి మాట్లాడ్డానికి స్మితకు ఉన్న అర్హతలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు… అంగవైకల్యం ఉన్న వారి గురించి మాట్లాడాలంటే అర్హత అంగవైకల్యం ఉండాలా తల్లి? ఆవిడ అంగవైకల్యం ఉన్న వారి గురించి మాట్లాడలేదు. రిజర్వేషన్ ల గురించి మాట్లాడారు.
క్షేత్ర స్థాయిలో పని చేయడం అంటే ఫీల్డ్‌లో పరిగెత్తడం కాదు… అందరు IAS ఆఫీసర్ లు AC రూముల్లో పని చేయరు. కొన్ని సార్లు విపత్తుల సమయం లో ప్రజల్లో ఉండాల్సి ఉంటది. కనీస సౌకర్యాలు లేని చోట పని చేయాల్సి ఉంటది. IAS ఆఫీసర్ కి బాధ్యతలు నిర్వర్తించడానికి ఫిసికల్ క్యాపబిలిటీస్ అడ్డంకి కాకూడదు అని చెప్పారు.
పిట్ట కూస్తున్నది రెట్ట వేస్తుంది. ఇదే కదా ట్వీట్ అంటే?
What smitha told is immature…IAS is about implementing govt schemes and law and order..for this what kind of physical fitness…first, candidate should be mentally fit..
Jagan 151 ekada
asalu reservations enduku? evaro kontha mandi maatrame vaatiki arhulu. ambedkar garu 10yrs maatrame ani annaru.
IAS, IPS ki physcial fitness chaala avasaram. aame annadaantlo tappemi ledu. IAS lu field lo tiragali. allarlu varadalu appudu office lone undaleru kadaa . ika IPS ki fitness lekapote ela?
mari raajakiyalalo kooda reservation istara?
రిజర్వేషన్లు ఏస్ధాయిలోను ఏ కారణంచేత సమర్ధనీయంకాదు .వాణ్ణికొట్టి వీడికిపెట్టటమే . ఇక అంగవైకల్యంఉన్నవారివిషయంలో కూడ మనకుసరియైన అవగాహన అవసరం .వారిని నిరాకరించటమంటే అవమానించినట్లుగా భావించరాదు .వారి వైకల్యాన్ణిబట్టి వారిని ఏపనిలోవుంచాలో అంతవరకేగానీ, నడుముల్లేనివాళ్ళనుకూడ సీట్లోకూచోపేట్టారు .అతను సీట్లోనుండి లేవాలంటే మనిషివుండాల్సిందే .ఇలాంటివి చాలావున్నయి .ఆలోచించాల్సిందే .