వంగవీటి మోహన్‌రంగా హత్యానంతరం రాజకీయంగా, వ్యక్తిగతంగా కమ్మ, కాపు సామాజిక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించుకుంటున్నాయి. అయితే పవన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు పల్లకీ మోయడానికి సామాజిక వర్గం మొత్తాన్ని బానిసలుగా మార్చాలని అనుకుంటున్నారనే ఆరోపణ వుంది. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ప్రాధాన్యం సంతరించకుంది.
చంద్రబాబు, పవన్‌కల్యాణ్ అంగీకారినికి వచ్చినంత మాత్రాన క్షేత్రస్థాయిలో ఆ రెండు సామాజిక వర్గాలు రాజకీయంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పయనించే అవకాశమే లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ పరంపరలో కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గం తాజా హెచ్చరిక హాట్ టాపిక్ అయ్యింది.
తెలంగాణలో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి జనసేన తరపున ప్రేమ్‌కుమార్ అనే నాయకుడు బరిలో ఉన్నారు. ఈయన గెలుపు కోసం కాపు సంఘాలు బలంగా పని చేస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నాయి. దీంతో చంద్రబాబు సామాజిక వర్గం ఓట్లపై జనసేన గురి పెట్టింది. ఇందులో భాగంగా ఏపీ రాజకీయంతో కాపులు మెలిక పెట్టారు.
కూకట్‌పల్లిలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు జనసేనకు వేయాలని, లేదంటే ఆంధ్రాపై తీవ్ర ప్రభావం చూపుతుందని కాపులు బహిరంగంగానే హెచ్చరించడం గమనార్హం. కూకట్‌పల్లిలో ప్రేమ్‌కుమార్ గెలుపు కోసం కమ్మలు ఓట్లు వేయకపోతే, ఆంధ్రప్రదేశ్‌లో తమ సామాజిక వర్గం కూడా అట్లే వ్యవహరిస్తుందని, దాని వల్ల టీడీపీకే నష్టమని పవన్ సామాజిక వర్గం పెద్దలు హెచ్చరించడం గమనార్హం.
ఈ రాజకీయ పరిణామాల్ని ముందే ఊహించినవే. తెలంగాణలో జనసేనకు టీడీపీ మద్దతు ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్‌లో కాపులు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.