క‌విత‌ హాజరు కావాల్సిందే.. ఈడీ!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ రావాలని ఎమ్యెల్సీ క‌విత‌కు ఈడీ నోటీసులు ఇవ్వ‌డంపై ఆమె సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేయగా విచార‌ణ చేప‌ట్టిన సుప్రీం కోర్టు త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 26కు…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ రావాలని ఎమ్యెల్సీ క‌విత‌కు ఈడీ నోటీసులు ఇవ్వ‌డంపై ఆమె సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేయగా విచార‌ణ చేప‌ట్టిన సుప్రీం కోర్టు త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 26కు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు ఈడీ సమన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మ‌రోవైపు వాద‌న‌లు వినిపించిన ఈడీ క‌విత విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందేన‌ని.. కావాలంటే మ‌రో 10 రోజులు స‌మ‌యం ఇస్తామ‌ని సృష్టం చేసింది. ఇన్ని రోజులు లిక్క‌ర్ స్కాంలో ఈడీ సైలెంట్‌గా ఉన్న.. నిన్న మ‌రోసారి క‌విత‌కు నోటిసులు జారీ చేసింది. ఇప్ప‌టికే మూడుసార్లు క‌విత‌ను ఈడీ విచారించిన విష‌యం తెలిసిందే. 

కాగా ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో రామచంద్ర పిళ్లై కంటే ముందు శరత్ చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ,దినేష్ అరోరా అప్రూవర్‌గా మారారు. ఈ క్రమంలో కవిత విచారణ కీలకంగా మారినట్లుగా తెలుస్తోంది. ఈకేసులో నిందితులు అప్రూవర్లుగా మారిన క్రమంలో కవితను మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వటంతో ఆసక్తికరంగా మారింది.