కాన్సాస్ సిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

అమెరికా లోని కాన్సాస్ నగరం లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక హిందు దేవాలయం లో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 3000…

అమెరికా లోని కాన్సాస్ నగరం లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక హిందు దేవాలయం లో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 3000 మంది తెలుగు వారు పాల్గొన్నారు.

మొదట అమ్మ వారి పూజా కార్యక్రమాన్ని దేవాలయ పూజారి శ్రీ శ్రీనివాసాచారి గారు, TAGKC అధ్యక్షులు శ్రీ నరేంద్ర దూదేళ్ళ దంపతులతో నిర్వహించారు.ఈ సంబరాలను మొదటి నుండి చివరివరకు ఎంతో ఉత్సాహంగా వ్యాఖ్యాత రేణు శ్రీ నడిపించింది. 

మహిళలు అంతా ఎంతో చక్కగా సంప్రదాయ దుస్తులను ధరించి, చక్కగా రంగు రంగు ల పూల తో బతుకమ్మ లను తయారు చేసి ఈ సంబరాల లో పాల్గొన్నారు. ఆద్యంతమూ ఎన్నో ఉత్సాహ బరితమైన తెలంగాణ జానపద బతుకమ్మ పాటలకు అందరూ ఉత్సాహం గా నృత్యాలు చేశారు. 

బతుకమ్మ లు తెచ్చిన వారికి Raffle Tickets ఇచ్చి మధ్య మధ్య లో Raffles లో గెలిచిన వారికి బహుమతులు అంద చేశారు. అంతే కాకుండా చక్క గా చేసిన 8 బతుకమ్మ లకు చీరె లను బహుమతులు గా ఇచ్చారు. బతుకమ్మ లను నిమజ్జనం చేశాక చివర గా చక్కని భోజనం అందరూ కలిసి చేసి పండుగ ని ఆనందం గా చేసుకున్నరు. 

ఈ కార్యక్రమం కి సహాయ పడ్డ కార్యకర్తలందరికీ, స్పాన్సర్స్ కి, TAGKC అధ్యక్షులు శ్రీ నరేంద్ర దూదేళ్ళ, ఉప అధ్యక్షులు శ్రీ చంద్ర యక్కలి, Trust Board Chair శ్రీ శ్రీధర్ అమిరెడ్డి, ఎగ్జిక్యూటివ్  కమిటీ  అండ్  ట్రస్ట్  బోర్డు  మెంబెర్స్  కృతజ్ఞతలు తెలిపారు.