తెలంగాణ గవర్నర్ తమిళిసైపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌తో కలిసి పని చేయడం కష్టమని, ఆయనో నియంతని గవర్నర్ ఘాటు విమర్శలు చేయడంపై మంత్రి సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.
మంత్రి తలసాని బుధవారం మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ ఏం కోరుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రొటోకాల్ వ్యవహారాలు చూసుకోడానికి ప్రత్యేకంగా అధికారులు ఉంటారన్నారు.
రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్‌మీట్లు పెట్టి నిందించటం సరికాదన్నారు. గవర్నర్ రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తమవి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలన్నారు. సీఎం సహా తామంతా నామినేటెడ్ వ్యక్తులు కాదని గవర్నర్‌కు గట్టిగా చెప్పారు.
కేసీఆర్‌తో పనిచేయటం ఇష్టం లేదని చెప్పటం సరికాదన్నారు. ఇష్టానుసారం మాట్లాడ్డం సరైంది కాదని ఆయన హితవు చెప్పారు. ప్రజాప్రభుత్వంపై ఆరోపణలు సరికాదన్నారు. ఉపరాష్ట్రపతి, గవర్నర్ అనే పాత్ర చాలా తక్కువన్నారు.
గవర్నర్‌గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండని హితవుపలికారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వారే ప్రోటోకాల్ విషయంలో కొన్ని రెస్ట్రక్షన్స్ ఉంటాయి అన్నారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని గవర్నర్ తెలుసుకొని మాట్లాడాలని మంత్రి కోరారు.