Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు!

ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు!

బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య త‌మ‌ను మోసం చేశాడ‌ని, అమ్మాయిల‌ను పంపించాల‌ని, కోర్కెలు తీర్చాల‌ని బెదిరిస్తున్నాడ‌ని ఆరిజిన్ డెయిరీ డైరెక్ట‌ర్ ఆరోపించారు. ఇందుకు ఆధారాలున్నాయంటూ ఆడియో, వీడియోలు విడుద‌ల చేశారు. ఆయన చెప్పిన పని చేయలేదని కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టించి తమను అరెస్టు చేయిస్తున్నారన్నారు.

బిజినెస్‌ మీటింగ్‌ కోసం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తరుచుగా చిన్నయ్యను కలిసే వాళ్లం అని.. ఆ క్రమంలో ఒకరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు నాతో పాటు మరో అమ్మాయి వచ్చింది. ఒక రోజు ఎమ్మెల్యే కాల్‌ చేసి మీతోపాటు వచ్చిన అమ్మాయిని నైట్‌కు పంపిస్తారా? అని అడిగార‌ని. ఆ అమ్మాయి అలాంటిది కాదు… కుదరదు అని చెప్ప‌డంతో ఏ అమ్మాయినైనా పంపించాలని ఒత్తిడి చేశారన్నారు. ద‌ళిత బంధు గురించి మాట్లాడుదామ‌ని పిలిచి లైంగికంగా వేధించారని శేజ‌ల్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తనపై లైంగిక వేధింపులను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఖండించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనపై ఆరోపణలు చేశారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తనపై ఉద్దేశ్యపూర్వకంగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాట్సాప్ చాటింగ్స్ తో తనకు సంబంధం లేదన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?