Advertisement

Advertisement


Home > Politics - Telangana

మహిళా కమిషన్ కు బండి లేఖ!

మహిళా కమిషన్ కు బండి లేఖ!

ఎమ్మెల్సీ క‌విత‌పై అనుచిత వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో మ‌హిళా క‌మిష‌న్ పంపిన నోటీసుల‌పై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ స్పందించారు. మ‌హిళా క‌మిష‌న్ ఆయ‌న‌ను ఈ నెల 15న విచార‌ణకు హాజరుకావాల‌ని నోటీసులో పేర్కొన‌గా.. రేపు రాలేన‌ని, ఈ నెల 18న విచార‌ణ‌కు హాజ‌ర‌వుతానని క‌మిష‌న్ కు లేఖ రాశారు. 

గ‌త వారంలో ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ క‌విత‌కు ఈడీ అధికారులు నోటిసులు ఇవ్వడంతో ఓ స‌మావేశంలో బండి సంజ‌య్ మాట్లాడుతూ.. లిక్క‌ర్ స్కామ్‌లో అడ్డంగా బుక్కైన కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? అంటూ వ్యాఖ్య‌లు చేయ‌డంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిర‌స‌ల‌ను చేశారు. 

బండి సంజ‌య్ వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డీజీపీను రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. దీంతో డీజీపీ రాష్ట్ర మహిళా కమిషన్ కు నివేదికను సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా బండి సంజయ్ కు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. నోటిసులకు స‌మాధానం ఇస్తూ..   పార్లమెంట్ సమావేశాలున్నందున ఈ నెల 18న విచారణకు హాజరు కానున్నట్టుగా ఆయన తెలిపారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?