Advertisement

Advertisement


Home > Politics - Telangana

కేసీఆర్ పార్టీ పేరు మార్పు సాధ్యమేనా?

కేసీఆర్ పార్టీ పేరు మార్పు సాధ్యమేనా?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు అంత ప్రధానమైనవిగా కనబడటం లేదని అనిపిస్తోంది. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ నాయకుల దృష్టి అంతా ఇప్పుడు పార్టీ పేరు మార్పు మీదనే ఉంది. ఆ విషయం మీదనే పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. 

పేరు మారిస్తేనే అంటే తిరిగి టీఆర్ఎస్ గా మారిస్తేనే దశ తిరుగుతుందని బలమైన నమ్మకం ఏర్పడింది. విచిత్రమేమిటంటే పార్టీకి ఇంతటి దుర్గతి ఎందుకు పట్టిందని ఎవరూ ఆలోచించడం లేదనిపిస్తోంది. అధికారంలో ఉన్న పదేళ్లలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు అహంకారంతో వ్యవహరించారు. 

అవినీతిలో కూరుకుపోయారు. కన్నూ మిన్నూ కానకుండా వ్యవహరించారు. తెలంగాణా సమాజం ఈ విషయాన్ని గుర్తించి ఎన్నికల్లో బుద్ధి చెప్పినా కేసీఆర్, పార్టీ నాయకులు ఆ సంగతి గ్రహించడంలేదు. ఆత్మవిమర్శ చేసుకోకుండా పార్టీ పేరు మార్చినందువల్లనే ఓడిపోయామని సెంటిమెంటల్ గా ఫీలవుతున్నారు.

కేసీఆర్ కు సెంటిమెంట్లు ఎక్కువనే సంగతి అందరికీ తెలిసిందే. పార్టీ ఓటమికి కూడా పేరు మార్పే కారణమనే సెంటిమెంట్ ను ప్రయోగిస్తున్నారు. కానీ పేరు మార్పు అనేది వర్కవుట్ అవుతుందా అనే సందేహాన్ని కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ తన పేరును మార్చుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ పార్టీ ఆ ప్రయోగం చేస్తోంది.  

పేరు మార్పు కారణంగానే ఓటర్లు బీఆర్ఎస్ ను తిరస్కరించారని కొందరు తెలంగాణవాదులు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్  ఓటమికి కారణాలపై విశ్లేషించగా 80 శాతం మంది బీఆర్ఎస్ కార్యకర్తలు పేరు మార్పే పార్టీ ఓటమికి కారణమని అభిప్రాయపడ్డారు. 

పేరు మార్చిన తర్వాత అన్నీ నష్టాలే తప్ప లాభాల్లేవని, పార్టీ కష్టాల్లో పడేందుకు కారణం పేరు మార్పిడే కారణమని కేసీఆర్ మైండ్ లోకి ఎక్కించారు. సరే ...ప్రస్తుతం దీని మీద పార్టీలో కసరత్తు సాగుతోంది. టీ ఆర్ఎస్ పార్టీ పేరు ఇంకా మిగిలే ఉందా, మరేవరైనా ఆ పేరుతో పార్టీని నమోదచేయించారా, ఒకవేళ  పార్టీని టీఆర్ఎస్ గా  మారిస్తే వచ్చే ప్యవసానాలేమిటీ అనేదాని మీద న్యాయనిపుణులో కూడా చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. 

అయితే పార్టీ పేరును మళ్లీ మార్చడం వల్ల ప్రజల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయని ఓ రాజకీయ విశ్లేషకుడు చెప్పారు. బీఆర్ఎస్ గా మారాక టీఆర్ఎస్ పేరును మరో నాయకుడు రిజిస్టరు చేయించుకున్నారని, దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నిచారు. ఆ పేరును ఎవరు రిజిస్టర్ చేయించుకున్నారో తెలియదు. అదే నిజమైతే కేసీఆర్ ఏం చేస్తారనేది ప్రశ్న.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?