
ఎన్ని అబద్ధాలు చెప్పి అయినా సరే, ఆచరణ సాధ్యం కానీ ఎన్ని హామీలు ప్రకటించి అయినా సరే.. ఈ దఫా అధికారంలోకి వచ్చి తీరాలని చంద్రబాబునాయుడు ఆంధ్ర ప్రదేశ్ లో కంకణం కట్టుకున్నారు. అంటూ ఆయన ప్రకటించిన కొన్ని వరాలలో.. అసలు ఆచరణకు సాధ్యమేనా, చంద్రబాబు నాయుడు లాంటి మాట నిలకడ లేని వ్యక్తి ఇలాంటి హామీలను నిలబెట్టుకుంటాడా?
మడత పేజీలు పెట్టి గెలిచిన తర్వాత ప్రజలను మోసం చేయకుండా ఉంటాడా? అని అనుమానాలు పుట్టించేవి అనేకం ఉన్నాయి. . అయితే చూడడానికి మాత్రం ఆకర్షణీయంగా కనిపించే హామీలు. అందుకే కాబోలు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు హామీలను కాపీ పేస్ట్ చేసినట్లుగా, వీలైతే వాటిలో కొన్నింటిని ఇంప్రొవైజ్ చేసినట్లుగా తమ ఎన్నికల వరాలను ప్రకటించింది.
తెలంగాణలో ఎన్నికలకు సమర శంఖం పూరిస్తూ.. ఆదివారం నాటి బహిరంగ సభలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు వాగ్దానాలలో కొన్ని కీలకమైనవి చంద్రబాబు బాటలోనే ఉన్నాయి. మహాలక్ష్మి పథకం కింద.. ప్రతి మహిళకు ప్రతినెలా 2500 ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. చంద్రబాబు నాయుడు కూడా ఇదే తరహాలో రాష్ట్రంలోని ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని తన మినీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు తరహాలోనే కాంగ్రెస్ పార్టీ కూడా దొంగనాటకాలు ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది.
ప్రతి మహిళకు అంటున్నారే తప్ప అందులో ఎలాంటి వడపోత ఉంటుందని విషయం ఈ పార్టీలు స్పష్టత ఇవ్వడం లేదు. పేద వర్గానికి చెందిన తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు మాత్రమే ఈ మొత్తం ఇస్తారా.. లేదా కులమతాలు, ఆర్థిక, వయోతారతమ్యాలు లేకుండా రాష్ట్రంలోని పడితే మహిళకు కాంగ్రెస్ పార్టీ రూ.2500 ఇస్తుందా అనేది స్పష్టంగా తెలియడం లేదు. చంద్రబాబు చెప్పినట్లుగానే.. కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. అలాగే ప్రతి ఏటా కౌలుదారులతో సహా రైతులందరికీ రూ.15,000వంతున అందిస్తామని హామీ కూడా చంద్రబాబును చూసి ప్రకటించినట్లు గానే కనిపిస్తోంది.
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిమ్మిని బమ్మి చేసి అయినా, ఎన్ని మాయమాటలు చెప్పినా అధికారంలోకి వచ్చి తీరాలని నానా పాట్లు పడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే మాదిరిగా కనిపిస్తోంది. వరాల రూపేణా చూసినప్పుడు జ్యోతి పథకంకింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, కళాశాల విద్యార్థులకు కోచింగ్ ఫీజు కోసం ఐదు లక్షల వరకు సహాయం లాంటివి కాంగ్రెస్ అనేకం ప్రకటించింది గాని.. విధివిధానాలను కూడా వెల్లడిస్తే తప్ప వారి మాటలను నమ్మలేము అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా