Advertisement

Advertisement


Home > Politics - Telangana

మరో ఘోర అగ్ని ప్రమాదం..ఆరుగురు మృతి!

మరో ఘోర అగ్ని ప్రమాదం..ఆరుగురు మృతి!

హైదరాబాద్​ నగరంలో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్​ స్వప్నలోక్​ కాంప్లెక్స్​లో గురువారం రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. ఆరుగురు ఊపిరాడక మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా 25 ఏళ్ల వయసులోపే వారిగా తెలుస్తోంది.

గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో స్వప్నలోక్​ కాంప్లెక్స్​ లో ప్రమాదం జరిగింది. ఎనిమిదో అంతస్తులో మొదలైన మంటలు 7, 6, 5 అంతస్తులకు వ్యాపించాయి. ఐదో అంతస్తులోని ఆరుగురు సిబ్బంది.. అగ్నికి తాళలేక ఓ రూమ్​లోకి వెళ్లి దాక్కున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెళ్లే సరికి.. వాళ్లంతా రూమ్​లో స్పృహ తప్పిపడిపోయారు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పొగకు ఊపిరాడక చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. 

ఆగ్ని ప్ర‌మాదానికి గురైన స్వప్నలోక్​ కాంప్లెక్స్​ లో ఫైర్ సేప్టీ రూల్స్ పాటించ‌లేద‌ని తేలితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ అమోయ్ కుమార్ హెచ్చరించారు. ప్ర‌మాదంలో బిల్డింగ్ స్ట్ర‌క్చ‌ర్ దెబ్బ‌తిన్న‌ట్లు వెల్ల‌డించారు. భ‌వ‌నాన్ని పూర్తిగా ప‌రిశీలించిన త‌రువాత కూల్చివేత‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?