Advertisement

Advertisement


Home > Movies - Movie News

పుష్ప2-మొదలైన పాటల పని

పుష్ప2-మొదలైన పాటల పని

మోస్ట్ ఎవైటింగ్ మూవీ పుష్ప 2 పాటల పని మొదలైంది. దర్శకుడు సుకుమార్ సినిమాలు అంటే పాటలు కీలకం. పుష్ప విజ‌యానికి పాటలు ఎంత దోహదం చేసాయో తెలిసిందే. పాటలు అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యాయి. 

సుకుమార్ అంటే దేవీ ప్రత్యేకమైన శ్రద్ద పెట్టి పాటలు చేస్తారు అనే టాక్ వుంది. రంగస్థలం సినిమా సక్సెస్ కు కూడా దేవీ పాటలు కీలకం. ఇప్పుడు మళ్లీ మరోసారి ఈ కాంబినేషన్ పుష్ప 2 సినిమా కోసం పని చేస్తోంది.

ఈ సినిమా షూట్ కు ఓ వారం పది రోజులు విరామం ఇచ్చారు. వెంటనే సుకుమార్ చెన్నయ్ లో వాలిపోయారు. ఇప్పుడు ఆ ఇద్దరూ కలిసి ట్యూన్ ల మీద కుస్తీ పడుతున్నారని బోగట్టా. కవి చంద్రబోస్ కూడా వీళ్లతో జాయిన్ కావాల్సి వుంది. ఈ ముగ్గురు కలిస్తే మామూలు పాటలు పుట్టవు…ఓ బ్లాక్ బస్టర్ అడియో బయటకు వస్తుంది.

దేవీ ఇస్తే సూపర్ హిట్ ఆల్బమ్ ఇస్తాడు లేదంటే లేదు. ఉప్పెన, రంగస్థలం, పుష్ప, వాల్తేర్ వీరయ్య లాంటి సినిమాల సక్సెస్ లో దేవీ కి తగిన క్రెడిట్ వుంది. ఇప్పుడు పుష్ప2 కి ఏం చేస్తాడో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?