Advertisement

Advertisement


Home > Politics - Telangana

కుటుంబం మొత్తం ఆత్మహత్య.. సైనైడ్ ఎక్కడిది?

కుటుంబం మొత్తం ఆత్మహత్య.. సైనైడ్ ఎక్కడిది?

సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. ఆర్థిక ఇబ్బందుల్లేవ్.. ఇద్దరు మగపిల్లలు.. ఇలా పచ్చగా సాగిపోతున్న సతీష్ కుటుంబంలో ఒక్కసారిగా కుదుపు. ఇద్దరు కొడుకులు అనారోగ్యం బారినపడ్డారు. దీంతో మానసిక వేదనకు గురైన ఆ కుటుంబం ఆత్యహత్య చేసుకుంది. హైదరాబాద్ లో జరిగింది ఈ ఘటన.

సతీష్-వేద దంపతులు హైదరాబాద్ లోని కుషాయిగూడలో ఉంటారు. వీళ్లకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకుకు 9 ఏళ్లు. చిన్నోడికి ఐదేళ్లు. చిన్నోడు పుట్టుకతోనే ఆటిజంతో పుట్టాడు. ఇది చాలాదన్నట్టు పెద్దోడు కూడా తాజాగా మెనింజైటిస్ బారిన పడ్డాడు. చెవుల నుంచి చీము కారి చెవుడు వచ్చేసింది.

అప్పట్నుంచి పిల్లల ఆరోగ్యంపై దంపతులిద్దరూ ఆందోళన చెందడం మొదలుపెట్టారు. ఎంత ఖర్చుపెట్టి చికిత్స చేయించినా చిన్నారుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

భార్యతో పాటు, చిన్నారులిద్దరికీ ఆహారంలో సైనైడ్ కలిపిచ్చాడు సతీష్. వాళ్లు చనిపోయారని నిర్థారించుకున్న తర్వాత, తను కూడా అదే ఆహారం తిని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి చూసి, మానసికంగా కుంగిపోయి సతీష్ ఈ పనికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. అతడికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని అంటున్నారు.

మరోవైపు ఘటనా స్థలం లో సూసైడ్ లెటర్ కూడా దొరికింది. మా నలుగుర్ని కాపాడే ప్రయత్నం చేయొద్దని, ప్రశాంతంగా చనిపోనివ్వాలంటూ ఆ ఉత్తరంలో రాసి ఉంది. 

మృతదేహాల్ని పోలీసులు మార్చురీకి తరలించారు. కేసు ఫైల్ చేసి విచారణ చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన సతీష్ కు ప్రమాదకరమైన పొటాషియం సైనైడ్ ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?