Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ పూజా-శ్రీలీల నే అంటే..!

మళ్లీ పూజా-శ్రీలీల నే అంటే..!

మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు పూజా హెగ్డే-శ్రీలీల. మళ్లీ అదే విధంగా పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా పూజా-శ్రీలీలే అంటే..? ఇప్పుడు అదే ఆలోచన హీరోయిన్ పూజా కు కూడా అని తెలుస్తోంది. ఎందుకంటే..పవన్-హరీష్ ల సినిమాకు ఇద్దరు హీరోయిన్లు కావాలి. శ్రీలీల ను హీరోయిన్ గా దాదాపు ఫిక్స్ చేసుకున్నారు. మరో హీరోయిన్ వేట ఇంకా కొనసాగుతోంది.

మాళవిక మోహనన్ ను తీసుకోవాలని అనుకున్నారు. ఇద్దరు హీరోయిన్ల సినిమా అని బయటకు ముందుగానే వచ్చేయడంతో మాళవిక ముందుగానే డిసైడ్ అయిపోయారు చేయను అని. అందుకే తను ‘సోలో హీరోయిన్’ గా చేస్తున్నా అంటూ ఇండైరెక్ట్ గా హింట్ కూడా ఇచ్చేసారు. దీంతో ఇప్పుడు మరో హీరోయిన్ కోసం వేట మొదలైంది

హరీష్ మళ్లీ బ్యాక్ టు పూజా వైపే దృష్టి పెట్టారు. ఈ మేరకు సంప్రదించడం జ‌రిగిపోయింది. ఇక పూజా వైపు నుంచి ఓకె అనడం మిగిలింది. కానీ మళ్లీ సేమ్ కాంబినేషన్ సినిమా చేయడమా? క్యారెక్టర్ ఏమిటి అన్నది పూజా ఆలోచనగా తెలుస్తోంది. 

పవన్ కళ్యాణ్ సినిమా కనుక పాజిటివ్ గానే వుందని తెలుస్తోంది. వెంట వెంటనే సేమ్ కాంబినేషన్ అన్నదే మిగిలిన ఏకైక అభ్యంతరం అని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?