Advertisement

Advertisement


Home > Movies - Movie News

'నాటు నాటు' అసలు ట్యూన్ అది కాదంట

'నాటు నాటు' అసలు ట్యూన్ అది కాదంట

నాటు..నాటు.. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన సాంగ్. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ పాటకు ఏకంగా ఆస్కార్ వచ్చింది. మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ సంయుక్తంగా ఈ పాటకు ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు.

ఇంత ఖ్యాతి గడించిన ఈ పాటకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. అసలు నాటు-నాటు పాట కోసం అనుకున్న ట్యూన్ అది కాదంటూ ప్రకటించారు.

"ఆర్ఆర్ఆర్ సినిమా రోలింగ్ టైటిల్స్ లో వాడిన ఎత్తర జెండా అనే పాట, నిజానికి నాటు-నాటు పాటకు ఆల్టర్నేట్ ట్యూన్. రాజమౌళికి ఆ ట్యూన్ బాగా నచ్చింది. కానీ నాటు-నాటు కోసం ఆ ట్యూన్ ను ఆయన ఓకే చేయలేదు. అలా అని దాన్ని పక్కనపెట్టేయడానికి ఇష్టపడలేదు. మరో చోట వాడుదామని చెప్పి రిజర్వ్ చేశాడు."

ట్యూన్ ను అలానే రిజర్వ్ చేసి పెట్టిన రాజమౌళి, సినిమాలో దాన్ని వాడలేకపోయాడట. అందుకే రోలింగ్ టైటిల్స్ లో పెట్టాడని కీరవాణి చెప్పుకొచ్చాడు. ఒకవేళ రాజమౌళి ఓకే చేసి ఉంటే.. ఎత్తర జెండా ట్యూన్ తోనే నాటు-నాటు సాంగ్ కంపోజ్ అయి ఉండేదనే ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?