Advertisement

Advertisement


Home > Politics - Telangana

హృదయవిదారకం.. భర్త మృతితో భార్య ఆత్మహత్య

హృదయవిదారకం.. భర్త మృతితో భార్య ఆత్మహత్య

భార్యల్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో దాచే భర్తలు.. బాయ్ ఫ్రెండ్ సహాయంతో భర్తల్ని హతమార్చే భార్యలున్న సమాజంలో బతుకుతున్నాం మనం. అయితే ఇదే సమాజంలో అన్యోన్యంగా జీవించే ఆలుమగలు కూడా ఉన్నారు. ఒకరికోసం ఒకరు ప్రాణాలిచ్చే జంటలు కూడా ఉన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఘటన అలాంటిదే.

గుండె పోటుతో భర్త మరణిస్తే, అతడు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయిన భార్య ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్ లోని డీడీ కాలనీలో జరిగిన ఈ ఘటన, చుట్టపక్కల వాళ్లను కలచివేసింది.

వనస్థలిపురంకు చెందిన మనోజ్ కుమార్, ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. ఆ తర్వాత మాస్టర్స్ కూడా పూర్తిచేసి అమెరికాలోని డాలస్ లో ఉద్యోగం సంపాదించాడు. అంబర్ పేట డీడీ కాలనీకి చెందిన సాహితితో అతడికి వివాహం జరిగింది. సాహితి కూడా ఇంజినీరింగ్ పూర్తిచేసింది. ఆస్ట్రేలియాలో ఎమ్మెస్ పూర్తి చేసింది.

భార్యభర్తలిద్దరూ డాలస్ లో కాపురం పెట్టారు. ఏడాదిన్నరగా సంతోషంగా ఉంటున్నారు. అదే టైమ్ లో సాహితికి కూడా అమెరికాలో ఉద్యోగం వచ్చింది. దీంతో పాస్ పోర్ట్ రెన్యూవల్ తో పాటు, కుటుంబ సభ్యుల్ని చూసే ఉద్దేశంతో ఇండియాకు వచ్చింది సాహితి. హైదరాబాద్ లో కొన్ని రోజులు అత్తారింట్లో, మరికొన్ని రోజులు పుట్టింట్లో ఉంటూ వస్తోంది

అంతా సజావుగా సాగిపోతున్న టైమ్ లో.. మనోజ్ కు గుండెపోటు వచ్చింది. అతడికి హార్ట్ ఎటాక్ వచ్చిందని స్నేహితులు సాహితికి సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే కొద్దిసేపటికి మనోజ్ చనిపోయినట్టు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. దీంతో సాహితి షాక్ లోకి వెళ్లిపోయింది. స్నేహితుల సహాయంతో మనోజ్ మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. 2 రోజుల కిందట అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు.

అంత్యక్రియల అనంతరం నిన్న తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది సాహితి. రాత్రి సాహితి, ఆమె చెల్లెలు ఒకే గదిలో నిద్రించారు. ఈరోజు ఉదయం సాహితి చెల్లెలు బయటకు వెళ్లింది. ఆమె అలా వెళ్లడంతోనే సాహితి తన గదిలో తలుపులు వేసుకుంది. ఫ్యాన్ కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది.

భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేక సాహితి ఇలా ఆత్మహత్య చేసుకుంది. తను చనిపోతూ తన నేత్రాల్ని దానం చేసింది సాహితి. ఎంతో అన్యోన్యంగా ఉండే భార్యభర్తలు ఇలా ఒకేసారి మరణించడంతో, స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?