Advertisement

Advertisement


Home > Politics - Telangana

హైదరాబాద్ లో ఆత్మహత్య.. విజయనగరంలో లింక్

హైదరాబాద్ లో ఆత్మహత్య.. విజయనగరంలో లింక్

హైదరాబాద్ శివార్లలోని మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఆత్మహత్యకు, విజయనగరంలో మూలాలు ఉన్నట్టు గుర్తించారు..

ఇంతకీ ఏం జరిగిందంటే.. మోకిల సమీపంలో ఉన్న టంగుటూరు గ్రామానికి చెందిన రవికి, గుంటూరుకు చెందిన తిరుపతి రావు పరిచయమయ్యాడు. అతడి ద్వారా విజయనగరంలో జరుగుతున్న జీఎస్ఎల్ ఫౌండేషన్ గురించి తెలుసుకున్నాడు. అనధికారికంగా నడుస్తున్న మనీ సర్కులేషన్ కంపెనీ ఇది.

ప్రారంభంలో ఈ కంపెనీలో తిరుపతి రావు ద్వారా కొంత డబ్బు పెట్టాడు రవి. 45 రోజుల తర్వాత కట్టిన డబ్బు మొత్తం తిరిగి ఇవ్వడంతో పాటు.. ప్రతి నెల కొంత మొత్తం చెల్లించారు. దీంతో తన గ్రామంలో చాలామందితో ఈ ఫౌండేషన్ లో డబ్బులు కట్టించాడు. అలా కట్టించినందుకు రవికి బాగానే కమీషన్ వచ్చింది.

అయితే ఇలాంటి వ్యవహారాలు ఎక్కువ రోజులు సాగవనే విషయం అందరికీ తెలిసిందే. కొన్ని రోజులకు డబ్బులు రావడం ఆగిపోయాయి. ఈ విషయం తెలియని రవి, తన పిల్లల పేరిట ఓ ఫంక్షన్ హాల్ నిర్మాణం కూడా చేపట్టాడు.

డబ్బులు అందని కస్టమర్లంతా రవిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అటు రవికి టచ్ లో ఉన్న తిరుపతిరావు పరార్ అయ్యాడు. అదే టైమ్ లో కొంతమంది మీడియా ప్రతినిధులకు విషయం తెలిసింది. వాళ్లు రవిని వేధించడం మొదలు పెట్టారు.

ఇలా ఒకేసారి సమస్యలు చుట్టుముట్టడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు రవి. తను చనిపోతే పిల్లలు అనాధలవుతారని భావించి, ముందుగా ముగ్గురు కొడుకులకు ఉరితాడు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న తన ఫంక్షన్ హాల్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.

వారం రోజుల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించారు పోలీసులు. కొంతమంది మీడియా ప్రతినిధులను అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత రిమాండ్ కు తరలించారు. మరికొంతమంది మీడియా ప్రతినిధుల కోసం వెదుకుతున్నారు. అటు విజయనగరం కేంద్రంగా సాగుతున్న మనీ సర్కులేషన్ కంపెనీపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?