Advertisement

Advertisement


Home > Politics - Telangana

మామలున్నార్రోయ్, జాగ్రత్త.. కుర్రాళ్ల వాట్సప్ అలర్ట్

మామలున్నార్రోయ్, జాగ్రత్త.. కుర్రాళ్ల వాట్సప్ అలర్ట్

బాసూ అటువైపు వెళ్లొద్దు, ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు రాస్తున్నారు.. అప్పుడుప్పుడు నగరంలో ఎవరో ఒక అపరిచితుడు మనమీద ప్రేమతో, మనం డబ్బులు పోగొట్టుకుంటామన్న జాగ్రత్తతో ఇలాంటి మాటలు చెబుతూనే ఉంటారు. కానీ మన టైం బాగోలేకనో, ఆ టైమ్ లో ఎవరూ అటు వెళ్లొద్దని మనకి చెప్పకపోతే, మనం హెల్మెట్ మరచిపోవడమో, లైసెన్స్ లేకపోవడమో జరిగితే చలాన్ పడిపోతుంది.

అయితే ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే ఫలానా సెంటర్లో చలాన్లు రాస్తున్నారని మెసేజ్ వస్తే ఎంత బాగుంటుంది చెప్పండి, ఆ రూట్ ని తప్పించుకుని ఇంకో రూట్ లో వెళ్లిపోతాం ఎంచక్కా. సరిగ్గా ఇలాంటి ఐడియానే కాకినాడ పిల్లలకి వచ్చింది. వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఎంచక్కా మెసేజ్ లు షేర్ చేసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల చలాన్ల నుంచి తప్పించుకుంటున్నారు.

భానుగుడి జంక్షన్ దగ్గర మాయలు ఉన్నార్రోయ్‌.. కాస్త చూసుకొని రండి.. అని ఒకడు వాయిస్‌ మెసేజ్‌ పెడితే.. లక్ష్మీ థియేటర్ దగ్గర కేసులు రాస్తున్నారు ఎవరూ అటువైపు వెళ్లొద్దంటూ మరొకడు టెక్స్ట్ మెసేజ్ పెడతాడు. ట్రాఫిక్ అప్డేట్స్ పేరుతో క్రియేట్ చేసిన ఈ గ్రూప్ లో 802మంది సభ్యులున్నారు. వీరిలో చాలామంది అలర్ట్ గా ఉంటారు, మిగతా వారికి చలాన్లు పడకుండా కాపాడుకుంటారు. ఈ వాట్సప్ గ్రూప్ వ్యవహారం ఆనోటా, ఈనోటా పోలీసులకు చేరింది. చివరకు అడ్మిన్ ని పట్టుకొచ్చారు, యాక్టివ్ మెంబర్స్ ని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.

విచిత్రం ఏంటంటే.. ఈ గ్రూప్ లో సభ్యులుగా ఉన్నవారిలో చాలామంది మైనర్లు. ఇంకొంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ లు కూడా లేవు. ఇటువంటి వాట్సప్‌ గ్రూప్‌ల వల్ల సమాజానికి నష్టం ఏమీ లేదు కానీ, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ చలాన్లకు దొరక్కుండా తిరగడం తప్పేకదా అంటున్నారు పోలీసులు. 

ర్యాష్‌ డ్రైవింగ్‌, మద్యం సేవించి వాహనాలు నడపడం, రోడ్డు నిబంధనలు ఉల్లంఘించడం వంటి పనులు చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి వీరికి కౌన్సెలింగ్‌ ఇచ్చామంటున్నారు కాకినాడ పోలీసులు. వాట్సప్‌ గ్రూప్‌ ని డిలీట్‌ చేశారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?