
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ, సీబీఐ విచారణను కవిత ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈడీ విచారిస్తున్న ప్రతి సందర్భంలోనూ ఆమె అరెస్ట్ తప్పదని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ విచారణ ముగించుకుని చక్కగా ఆమె విక్టర్ సంకేతాల్ని చూపుతూ నవ్వుతూ బయటికి వచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇక కవిత అరెస్ట్ లేకపోవచ్చు అనే చర్చకు తెరలేచింది.
అయితే కవితను పలు దఫాలు విచారించి, లిక్కర్ స్కామ్‌లో ఆమె ప్రమేయానికి సంబంధించి ఏవేవో ఆధారాలు చూపి, చివరికి అరెస్ట్ చేయకపోతే బీజేపీకే నష్టం అనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి రెండు రోజుల క్రితం ఇదే విషయమై సంచలన కామెంట్స్ చేశారు. ఒకవేళ కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని అనుకునే ప్రమాదం వుందని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తమ చేతుల్లో లేదన్నారు. అదంతా సీబీఐ పరిధిలోని అంశమని స్పష్టత ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో సంబంధం ఉందనే ఆధారాలుండడం వల్లే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్ట్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
అవినీతికి పాల్పడిన కర్నాటకలోని తమ పార్టీ ఎమ్మెల్యేను సైతం జైలుకు పంపామని ఆయన అన్నారు. అయితే దేశ వ్యాప్తంగా కేవలం విపక్షాల నేతలపై మాత్రమే కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాల్సి వుంది.
సీబీఐ, ఈడీ అరెస్ట్‌లతో తమకు సంబంధం లేదని కిషన్‌రెడ్డి చెప్పినంత మాత్రాన నమ్మే పరిస్థితిలో జనం లేరు. ఎందుకంటే దేశ వ్యాప్తంగా రాజకీయంగా మోదీ సర్కార్ ప్రతిపక్షాలపై వేధింపులకు పాల్పడుతోందనే భావన బలపడుతోంది. గత 9 ఏళ్లుగా మోదీ సర్కార్ ప్రధానంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కంటే, ప్రతిపక్షాలపై దాడుల ద్వారా బలహీనపరిచి, రాజకీయంగా సొమ్ము చేసుకుంటోందన్న అభిప్రాయం విస్తృతంగా వ్యాపిస్తోంది. కవిత అరెస్ట్‌తో తమకు సంబంధం లేదన్న మాత్రాన ఎవరూ నమ్మరనేది నిజం.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా