Advertisement

Advertisement


Home > Politics - Telangana

ష‌ర్మిల‌ను వ‌ద‌ల‌ని తెలంగాణ నాయ‌కుడు!

ష‌ర్మిల‌ను వ‌ద‌ల‌ని తెలంగాణ నాయ‌కుడు!

తెలంగాణ‌లో త‌నో పార్టీ పెట్టిన విష‌యం, అక్క‌డ నానార‌చ్చ చేసిన విష‌యం ష‌ర్మిల‌కు గుర్తుందో లేదో కానీ.. ఆమె బాధితులు మాత్రం మ‌రిచిపోవ‌డం లేదు! త‌ను తెలంగాణ కోడ‌ల్నంటూ అప్ప‌ట్లో ష‌ర్మిల చేయ‌ని స‌ర్క‌స్ అంటూ లేదు! అంత చేసీ.. అంద‌రినీ అన‌రాని మాట‌ల‌న్నీ అనీ చివ‌ర‌కు కాంగ్రెస్ లోకి త‌న పార్టీని విలీనం చేసేశారు ష‌ర్మిల‌!

తెలంగాణలో అవ‌కాశం వ‌చ్చినా ఏ ఉప ఎన్నిక‌లోనూ పోటీ చేయ‌ని ష‌ర్మిల పార్టీనే ఒక బ్ర‌హ్మ‌ప‌దార్థం! మామూలుగా ర‌క‌ర‌కాల మాటలు మాట్లాడేది. ఏదైనా ఎన్నిక అంటే మాత్రం.. ష‌ర్మిల పోటీలో లేకుండా పోయేది! అలా తెలంగాణ‌లో ఆమె కామెడీ సాగింది! 

అన్నింటికీ మించి వాక్ శుద్ధి లేకుండా ఏది బ‌డితే అది మాట్లాడి ష‌ర్మిల మ‌రింత అభాసుపాల‌య్యింది! అప్ప‌ట్లో ఆమెను న‌మ్ముకుని కొంద‌రు రోడ్డెక్కారు పాపం! కొంద‌రు ఖ‌ర్చులు పెట్టుకున్నారు, మరి కొంద‌రు మ‌ద్ద‌తుదార్లుగా నిలిచారు. వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి కూత‌రు అనో కాంగ్రెస్, బీఆర్ఎస్ లలో పొంద‌లేని వాళ్లు అక్క‌డ‌క్క‌డ ష‌ర్మిలవెంట న‌డిచారు. అలాంటి వారిలో కొండా రాఘ‌వ‌రెడ్డి కూడా ఉన్నారు.

ష‌ర్మిల త‌న పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన మ‌రుక్ష‌ణ‌మే కొండా రాఘ‌వ రెడ్డి ఆమెపై అసంతృప్తి వ్య‌క్తం చేసి రాజీనామా ప్ర‌క‌టించారు. వైఎస్ కుటుంబీకురాలు వైఎస్ పేరుతో ఒక పార్టీని పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేయ‌డం ఏమిటంటూ ఆయ‌న టీవీ 9లో విస్మ‌యం వ్య‌క్తం చేస్తూ స్పందించారు. ఆ త‌ర్వాత ష‌ర్మిల ఏపీ రాజ‌కీయంలోకి వ‌చ్చాకా రాఘ‌వ‌రెడ్డి మ‌రింత‌గా స్పందించ‌డం మొద‌లైంది.  

ష‌ర్మిల తీరును తీవ్రంగా ఎండ‌గ‌డుతున్న వారిలో ఈయ‌న ముందున్నారు. ఢిల్లీ వెళ్లి ఎవ్వ‌రూ ప‌ట్టించుకునే వారు లేక‌పోవ‌డంతో.. సీబీఐ వాళ్ల‌కు త‌నే మెసేజ్ పెట్టించి, ఉన్న‌ట్టుండి అక్క‌డ‌కు వెళ్లిందంటూ కూడా కొండా రాఘ‌వ‌రెడ్డి వ్యాక్యానించారు. ష‌ర్మిల భ‌ర్త కొన్ని ర‌కాల ప‌నుల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశార‌ని, దానికి జ‌గ‌న్ నో చెప్ప‌డంతోనే ఆమెకు,ఆమె భ‌ర్త‌కు కోపం వ‌చ్చింద‌ని.. ఆ త‌ర్వాతే ఈ ర‌చ్చ అంతా అని కొండా రాఘ‌వ‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఆయ‌న క‌డప జిల్లాలో తిరుగుతున్నారు. ష‌ర్మిల‌పై తీరును త‌ప్పు ప‌డుతున్నారు. తెలంగాణలో ఆమె వ్య‌వ‌హ‌రించిన తీరును, ఇప్పుడు క‌డ‌ప‌లో ఆమె మాట్లాడుతున్న తీరును త‌ప్పు ప‌డుతూ.. త‌ప్పు చేస్తున్నావ్ ష‌ర్మిల అంటూ వారించి చెబుతున్నారు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?