
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులపై స్టే ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రేపటి ఈడీ విచారణ నుండి మినహాయింపు ఇవ్వాలని ఆమె కోరగా, దీనికి కోర్టు నిరాకరించింది. దీంతో రేపు ఆమె ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది.
ఇప్పటికే ఈ కేసులో ఈ నెల 11న తొలిసారిగా కవితను ఈడీ విచారించింది. దాదాపు ఆ రోజు 9 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. కవిత అరెస్ట్ అవుతుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చెందిన ఆ రోజు ఈడీ అధికారులు అరెస్ట్ చేయలేదు. మరి రేపు జరిగే విచారణ ఎలా ఉండబోతుందో.. ఏమి జరుగుతుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
మరోవైపు మహిళా రిజర్వేషన్ల కోసం కవిత పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలో ఇవాళ విపక్షాల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు హజరుకానున్నారు. మహిళా రిజర్వేషన్లు అమలు చేసేవరకు తన పోరాటం ఆగదని కవిత ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. గతంలో కూడా మహిళా రిజర్వేషన్ల కోసం జనంతర్ మంతర్‌లో కవిత దీక్ష చేసిన విషయం తెలిసిందే.