Advertisement

Advertisement


Home > Politics - Telangana

రాముల‌మ్మ.. ఒకే దెబ్బకు ఇద్ద‌రు టార్గెట్!

రాముల‌మ్మ.. ఒకే దెబ్బకు ఇద్ద‌రు టార్గెట్!

బీజేపీ నేత, ఫైర్ బ్రాండ్ విజయశాంతి ఒక్కే ట్వీట్ తో ఇద్ద‌రి నేత‌లపై విమ‌ర్శ‌లు కురిపించారు. ఆ ఇద్ద‌రి నేత‌ల్లో ఒక‌రు సొంత పార్టీ నేత‌ కావ‌డం విశేషం. ఆ ఇద్ద‌రి నేతల్లో ఒక‌రు మంత్రి హ‌రీష్ రావు.. మ‌రోక నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీని గెలిపించేది వ‌ల‌స నేత‌లు కాద‌ని.. బీజేపీని గెలిపిస్తున్న‌ది కార్య‌క‌ర్త‌లు అంటూ ఇద్ద‌రి నేత‌ల‌కు చూరకలు అంటించారు.

'బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల చేతులెత్తేశారు, చిట్ చాట్ లో ఈటల చెప్పారు.. చేరికలు ఇక లేవు అంటున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ..... బీజేపీని నిరంతరం గెలిపిస్తున్నది ప్రాణమిచ్చే కార్యకర్తల త్యాగాలు, బీజేపీని నమ్మే ప్రజల విశ్వాసాలు, రక్తమిచ్చే హైందవ ధర్మశ్రేణుల పోరాటాలు మాత్రమే... చేరికల కమిటీ పేరు చెప్తూ, చిట్ చాట్ లను ప్రస్తావిస్తూ మీరు చేస్తున్న బీజేపీ వ్యతిరేక విమర్శల ప్రచారం ఎన్నటికి నిలవదు. ఇది హరీష్ రావు గారికి తెలవంది కాదు'.. అంటూ ట్వీట్ట‌ర్ వేదిక‌గా హ‌రీష్ రావును విమ‌ర్శిస్తునే ఈట‌ల వ‌ల్ల బీజేపీకి ఎటువంటి ప్ర‌యోజ‌నం లేద‌న‌ట్లుగా ట్వీట్ చేసింది.

కాగా ఓ స‌మావేశంలో మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. బీజేపీ ప‌ని అయిపోయింద‌ని చేరిక‌ల క‌మిటీ ఛైర్మ‌న్ ఈట‌ల రాజేంద‌ర్ స్వ‌యంగా చెప్పార‌ని.. బీజేపీలో ఎవ్వ‌రూ చేర‌డం లేద‌ని చేతులు ఎత్తేసిండు అని.. ఆయ‌న చెప్పేది వేదాంతం.. చేసేది రాద్దాంతం అంటూ బీజేపీపై విమ‌ర్శ‌లు కురిపిస్తు.. వ‌చ్చేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే అని అన్నారు. 

ఇటీవ‌ల ఓ చిట్ చాట్ లో ఈటెల మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల వాదం బలంగా ఉందని..  ఖమ్మంలో బీజేపీ లేదని.. కాంగ్రెస్‌ బలంగా ఉందని.. రోజూ పొంగులేటి, జూపల్లితో మాట్లాడుతున్నానని, వారు తనకే రివర్స్‌ కౌన్సిలింగ్‌ ఇస్తున్నారని.. ఇప్పటివరకు కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే వారిని ఆపగలిగానని, బీజేపీలో చేరడానికి వారికి భౌతికంగా ఇబ్బందులున్నాయన్నారు. కాగా ఈటెల వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ బీజేపీ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

గ‌త కొంత కాలంగా ఈటెల‌పై వ్య‌తిరేక‌త ఉన్న విజ‌య‌శాంతికి ఆయ‌న వ్యాఖ్య‌లు.. హ‌రీష్ రావు విమ‌ర్శ‌లు క‌లిసి రావ‌డంతో ఇలా ఇద్ద‌రిపై విమ‌ర్శ‌లు కురిపిస్తునే బీజేపీకి కార్యక‌ర్త‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌గా అవ్వ‌డానికి అవ‌కాశం దొరికింది. గ‌తంలో కూడా అన్ని పార్టీలోను కేసీఆర్ కోవ‌ర్టులు ఉన్నార‌ని.. బీజేపీలో కూడా కేసీఆర్ మ‌నుషులు ఉన్నార‌ని ఈటెల చేసిన కామెంట్స్ పై..బీజేపీలో కోవర్ట్‌లు ఎవరో చెప్పాలని విజ‌య‌శాంతి డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?