Advertisement

Advertisement


Home > Politics - Telangana

డీకే తో షర్మిల మ‌రోసారి భేటీ!

డీకే తో షర్మిల మ‌రోసారి భేటీ!

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి బతికించుకోవడం కోసం కాంగ్రెస్ అధిష్టానం వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిల స‌పోర్టును అడుగుతోందని గ‌త కొంత కాలంగా వస్తున్న వార్తలను నిజం చేకూరుస్తూ తాజాగా కర్ణాట‌క‌ డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో షర్మిల భేటీ అవ్వడంతో రాజకీయ వర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

కర్ణాటకలో బీజేపీ పార్టీని మట్టికరిపించిన ఊపు మీద ఉన్న‌ కాంగ్రెస్. ఈ ఏడాది చివర్లో జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. అందులో భాగంగా తెలంగాణ‌పై ప్ర‌తేక్య దృష్టి పెట్టిన కాంగ్రెస్.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను క‌లుపుకోని వ‌చ్చే ఎన్నిక‌ల్లోకి వెళ్లాలని చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో డీకే శివకుమార్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన నేపథ్యంలో- షర్మిల మర్యాదపూరకంగా ఆయనను కలుసుకున్నారు. నెల వ్య‌వ‌ధిలో రెండోసారి వీరి భేటీ జ‌ర‌గ‌డం విశేషం.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉన్న పార్టీని నడిపించే సమర్థవంతమైన నాయకుడు లేక‌పోవ‌డంతో ష‌ర్మిల పార్టీతో క‌లిసి ఎన్నిక‌లకు వెళ్లితే కాంగ్రెస్ పార్టీకి మంచి జ‌రుగుతుందని అధిష్టానం భావించినా.. గ్రూప్ రాజ‌కీయాల్లో ష‌ర్మిలకు మిగ‌త వారు స‌పోర్టు చేస్తారా అనేది సందేహమే. తెలంగాణ‌లో గెలిచి ఆంధ్ర‌లో త‌మ పార్టీ ఖాతా తెరవాలనే కాంగ్రెస్ పార్టీ ఎత్తుగ‌డ‌లు ఎంత వ‌ర‌కు నేరవేరుతాయో అనేది కాల‌మే స‌మాధానం చెప్పాలి.. ఎందుకంటే ఆంధ్ర‌లో కాంగ్రెస్ గుర్తుని మ‌రిచిపోయి జ‌నం చాలా కాల‌మైంది. వాళ్ల‌తో హ‌స్తం గుర్తుకి ఓటు వేయించ‌డం మాట‌లా?.

గ‌తంలో కుడా వీరి భేటీ త‌ర్వాత వైఎస్ఆర్టీపీ- కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరొచ్చంటూ వార్తలొచ్చినప్పటికీ.. షర్మిల వాటిని తోసిపుచ్చారు. డీకే శివకుమార్‌తో తన కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని, అందుకే ఆయనను మర్యాదపూరకంగా కలుసుకున్నానంటూ అప్పట్లో చెప్పుకొచ్చారామె. కాంగ్రెస్‌తో పొత్తు గానీ, తన పార్టీని విలీనం చేసే ప్రతిపాదనలేవీ లేవంటూ చెప్పిన విష‌యం తెలిసిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?