అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం

నార్త్ కరోలినా లోని షార్లెట్ నగరంలో వివేక్ అనే తెలుగు యువకుడు  రోడ్డు ప్రమాదంలో మరణించాడు.  ఇరవై నాలుగేళ్ల వివేక్ ఉన్నత చదువుల కోసం అక్కడకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. చదువుతో పాటు పార్ట్ టైమ్…

నార్త్ కరోలినా లోని షార్లెట్ నగరంలో వివేక్ అనే తెలుగు యువకుడు  రోడ్డు ప్రమాదంలో మరణించాడు.  ఇరవై నాలుగేళ్ల వివేక్ ఉన్నత చదువుల కోసం అక్కడకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. చదువుతో పాటు పార్ట్ టైమ్ గా ఒక  పెట్రోల్ బంకులో పనిచేసేవాడట వివేక్. 

అక్కడ విధులు ముగించుకుని వెళ్తుండగా ఒక వాహనం వివేక్ ను ఢీ కొట్టినట్టుగా తెలుస్తోంది. వివేక్ సొంతూరు చిత్తూరు జిల్లా మిరియంగంగన పల్లె. తండ్రి ఒక లాయర్. కుటుంబం బెంగళూరులో స్థిరపడినట్టుగా తెలుస్తోంది. 

చదువుల కోసం అమెరికాకు వెళ్లిన వివేక్ ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అతడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వివేక్ మృతదేహాన్ని ఇండియాను తరలిస్తూ ఉన్నారని తెలుస్తోంది.