తెలుగుదేశం పార్టీ పూర్తిగా తెగించినట్లుగా ఉంది. విజయవాడ స్వర్ణ పాలెస్ అగ్ని ప్రమాదం కేసుకు కులానికి పులమడానికి సిద్దమైనట్లు ఉంది.
రమేష్ ఆస్పత్రి యాజమాన్యంపై చర్య తీసుకుంటే కమ్మ వర్గంపై కక్ష సాధింపేనని నిసిగ్గుగా చెబుతోంది.
ఆ పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ లు ఇదే కోణంలో మాట్లాడారు.
జగన్ కు ఆ సామాజికవర్గంపై కక్ష ఎందుకు అని సత్యప్రసాద్ ప్రశ్నించారు.కేసులో డాక్టర్ రమేష్ ను ఇరికింటేయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
విచారణ పేరుతో డాక్టర్ మమతను వెధిస్తున్నారని ఆయన అన్నారు. ఆ సామాజికవర్గం వారు డాక్టర్లు, వ్యాపారులు, రైతులుగా ఉండరాదా అని ఆయన అన్నారు.
కులం ప్రస్తావన తెస్తూ టిడిపి నేతలు ఎదురు జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించడం విశేషం.