బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నెటిజన్లకు, అభిమానులకు సరికొత్త షాక్ ఇచ్చారు. కోట్లాది మంది అభిమానులను కలిగిన దీపికా ఏం చేసినా, చేయకపోయినా సంచలనమే.
కొత్త ఏడాదిని తమ అభిమాన హీరోయిన్ ఎలా సెలబ్రేట్ చేస్తారోనని ఎదురు చూసిన అభిమానులకు …ఆమె ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. దీపికకు ఇన్‌స్టాగ్రామ్‌లో 52 మిలియన్లు, అలాగే ట్విటర్‌లో 27 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
ఫాలోవర్ల సంఖ్యే ఆమె స్థాయి ఏంటో తెలియజేస్తోంది. 2021, జనవరి 1 నూతన ఏడాదిని పురస్కరించుకుని ఆమె తన రెండు ఖాతాల్లోని పోస్టులన్నింటినీ తొలగించారు. దీంతో ఏమైందో కారణం తెలియక అభిమానులు షాక్‌కు గురయ్యారు.
అసలు ఏం జరిగిందంటూ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ పెట్టారు. దీంతో అభిమానుల్లో నెలకున్న గందరగోళాన్ని పోగొట్టేందుకు ఆమె ముందుకొచ్చారు. తాజాగా ఓ ఆడియో సందేశాన్ని ఆమె షేర్ చేశారు.
నూతన సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించాలనే ఉద్దేశంతోనే తన పాత పోస్టులన్నింటినీ డిలీట్ చేసినట్టు చెప్పు కొచ్చారు. ఎన్నో జీవితానుభవాలను, గుణపాఠాలను ఇచ్చిన, నేర్పిన 2020కి ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని ఆమె కోరారు.
అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలంటూ ఉత్కంఠకు తెరదింపారామె. మొత్తానికి తనదైన స్టైల్‌లో వ్యవహరించి అందరి కంటే ఎక్కువ ప్రచారాన్ని పొందారు.