సోషల్ మీడియాలో ముద్దుగుమ్మలు ఓ పోస్ట్ పెట్టారంటే చాలు దానికి లక్షల్లో లైకులు వస్తాయి. ఆ ట్రెండ్స్ ను అమ్మాయిలు ఫాలో అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో విమర్శలు కూడా ఎదురవుతుంటాయి.
డ్రెస్ చెత్తగా ఉందంటూ కామెంట్స్ కూడా పడుతుంటాయి. ఈ వారం అలా ఐదుగురు ముద్దుగుమ్మలు ''చెత్త డ్రెస్ వేసుకున్న సెలబ్రిటీలు''గా పేరుతెచ్చుకున్నారు. ఆ టాప్-5 ముద్దుగుమ్మలెవరో చూద్దాం.
చెత్త డ్రెస్సులు వేసుకొని టాప్ లో నిలవడం రాఖీ సావంత్ కు వెన్నతో పెట్టిన విద్య. ఈ లిస్ట్ లో ఎప్పుడూ ఈమెదే అగ్రస్థానం. తాజాగా మరోసారి ఆమె చెత్త డ్రెస్ తో ఫొటోలకు పోజులిచ్చింది. నల్లటి క్లాత్ పై తెల్లటి సర్కిల్స్ తో డిజైన్ చేసిన ఆమె టాప్ అస్సలు సూట్ అవ్వలేదంటూ కామెంట్స్ వచ్చాయి. ఎక్కువ డిస్-లైక్స్ వచ్చింది ఈ డ్రెస్ కే.
ఈ లిస్ట్ లో రెండో స్థానం అనితది. రీసెంట్ గా తల్లయిన ఈ ముద్దుగుమ్మ, ఓ ఔట్ ఫిట్ తో బయటకొచ్చింది. ఫొటోలకు పోజులిచ్చింది. అయితే ఆమె వేసుకున్న డ్రెస్ లో ఫ్యాషన్ ట్రెండ్ లేదా డీటెయిలింగ్ ఏదీ కనిపించలేదంటూ కామెంట్స్ పడ్డాయి. ఇకపై ఇలాంటి దుస్తులు వేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలంటూ ఉచిత సలహాలు కూడా వచ్చాయి.
స్లిమ్ గా ఉంటే ఏ టైపు డ్రెస్ అయినా సెట్ అయిపోతుందనే ఫీలింగ్ లో ఉంది శిల్పాషెట్టి. అదే భ్రమలో ఓ వెరైటీ డ్రెస్ తో ఫొటో షూట్ చేసింది. కానీ అది క్లిక్ అవ్వలేదు. ఆమె ధరించింది చీర కాదు, అలా అని కంఫర్ట్ గా ఉండే డ్రెస్ కూడా కాదు. చీరకట్టుకు మోడ్రన్ టచ్ ఇద్దామనుకున్న ఆమె ఆలోచన ఫెయిల్ అయింది.
ఇక ఈ లిస్ట్ లో క్రిస్టల్ డిసౌజా, షిబానీ దండేకర్ కూడా చేరిపోయారు. వీళ్ల దుస్తులకు కూడా నెటిజన్ల నుంచి ట్రోలింగ్ తప్పలేదు. అలా ఈ వీకెండ్ ను ట్రోలింగ్స్ తో ముగిస్తున్నారు ఈ ఐదుగురు ముద్దుగుమ్మలు.