టీఆర్ఎస్ గెలుపు ఖాయం?

మరో కొద్ది గంటల్లో దుబ్బాక ఉపఎన్నిక ఫలితం రాబోతోంది. కాస్త ఉత్కంఠ వున్న మాట వాస్తవమే కానీ, టీఆర్ఎస్ గెలుపు మీద మరీ సందేహం లేదనే చెప్పాలి. Advertisement ఎన్నిక ముగిసిన రెండు మూడు రోజులకే…

మరో కొద్ది గంటల్లో దుబ్బాక ఉపఎన్నిక ఫలితం రాబోతోంది. కాస్త ఉత్కంఠ వున్న మాట వాస్తవమే కానీ, టీఆర్ఎస్ గెలుపు మీద మరీ సందేహం లేదనే చెప్పాలి.

ఎన్నిక ముగిసిన రెండు మూడు రోజులకే టీఆర్ఎస్ నేరుగా కేంద్రంలో వున్న భాజపా మీద దాడిని పెంచింది. కేంద్రం తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని నేరుగా ఆరోపించింది.

ఇది చూస్తుంటే తెరాసకు దుబ్బాక మీద గట్టి ఇంటిలిజెన్స్ రిపోర్టు అందినట్లే కనిపిస్తోంది. గెలుపు ఖాయమన్న ధీమా వచ్చినట్లే కనిపిస్తోంది. అందుకే ఈ ధీమాతోనే దూకుడు పెంచి, హైదరాబాద్ సిటీ ఎన్నికల పై దృష్టి పెట్టినట్లు అర్థమై పోతోంది.

సి ఓటర్ తప్ప మరే సర్వే కూడా భాజపాకు అనుకూలంగా లేదు. పైగా కరుడుకట్టిన తెరాస వ్యతిరేకి జర్నలిస్ట్ మల్లన్న కూడా దాదాపుగా తెరాస గెలుపు ఖాయమన్నట్లే చెప్పారు.

ఇటు టీఆర్ఎస్ స్వరం మారడం, సర్వేలు పెద్దగా కనిపించకపోవడం వంటి అంశాలు, దుబ్బాక ఉపఎన్నికలో తెరాస ఎంతో కొంత మెజారిటీతో అయినా గట్టెక్కుతుందనే స్పష్టం చేస్తున్నాయి.

కొంతమంది మెజారిటీ విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కానీ, అది కూడా పెద్దగా భయపడాల్సిన రేంజ్ లో వుండదనే రాజకీయ వర్గాల బోగట్టా. 

పెట్టుబడి దారుల విష పుత్రికలు మన పత్రికలు.. శ్రీశ్రీ