భక్తులకు బ్యాడ్ న్యూస్.. కంటైన్మెంట్ జోన్ గా తిరుపతి

శ్రీవారి దర్శనాలపై పరోక్షంగా క్లారిటీ వచ్చేసింది. తిరుపతిలో ఇవాళ్టి నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కాబట్టి కొండపై దర్శనాలు ఇక అంతంత మాత్రంగానే జరుగుతాయి. ఈరోజు, రేపు ఓ మోస్తరుగా దర్శనాలు జరిగినా.. గురువారం…

శ్రీవారి దర్శనాలపై పరోక్షంగా క్లారిటీ వచ్చేసింది. తిరుపతిలో ఇవాళ్టి నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కాబట్టి కొండపై దర్శనాలు ఇక అంతంత మాత్రంగానే జరుగుతాయి. ఈరోజు, రేపు ఓ మోస్తరుగా దర్శనాలు జరిగినా.. గురువారం నుంచి తిరుమలలో దర్శనాలు ఇక ఉండకపోవచ్చు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ్టి నుంచి తిరుపతిలో కంప్లీట్ లాక్ డౌన్ విధిస్తున్నట్టు కలెక్ట్ నారాయణ భరత్ గుప్తా ప్రకటించారు. ఈరోజు నుంచి కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతినిస్తారు. మెడికల్ షాపులు మాత్రమే తెరుస్తారు.

ప్రజలు ఎవరైనా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే బయట తిరగాలి. ఏమాత్రం నిబంధనలు ఉల్లంఘించినా కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. 11 తర్వాత బయట కనిపిస్తే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆగస్ట్ 5 వరకు ఈ కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తాయి.

లాక్ డౌన్ కారణంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో ఆఫ్-లైన్ ద్వారా జారీ చేస్తున్న 3వేల సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల జారీని రద్దుచేసింది. దీంతో ఆటోమేటిగ్గా దర్శనాలు తగ్గిపోతాయి. ఆల్రెడీ ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు  మాత్రం దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. వాళ్ల కోసం ఆర్టీసీ బస్టాండ్ లో కొండపైకి వెళ్లే బస్సులు ఉంటాయి. సొంత వాహనాల్లో వచ్చే వాళ్లు మాత్రం బైపాస్ రోడ్డు మీదుగా కొండపైకి చేరుకోవాలి. తిరుపతి పట్టణంలో తిరగడానికి అనుమతి లేదు.

తాజా నిబంధనలతో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆఫ్-లైన్ దర్శనాలు నిలిచిపోవడంతో.. ఆన్ లైన్ దర్శనాలు మాత్రమే జరుగుతాయి. అయితే ఆన్ లైన్ లో దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తుల్లో కూడా సగానికి సగం మంది తమ ప్రయాణాల్ని రద్దు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనాలు ఆటోమేటిగ్గా తగ్గిపోనున్నాయి.

పరాన్నజీవి ఫస్ట్ సాంగ్ రిలీజ్

షకలక శంకర్ డిరా బాబా వెబ్ సిరీస్ ట్రైలర్